close
Choose your channels

'నరుడా డోనరుడా' థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేస్తున్న మహేష్...

Monday, September 26, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హీరో సుమంత్ కథానాయ‌కుడుగా అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై సంయుక్తంగా రూపొందుతోన్నచిత్రం నరుడా..! డోన‌రుడా..!. రీసెంట్ గా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను అక్కినేని నాగార్జున విడుద‌ల చేశారు. ఫ‌స్ట్‌లుక్‌లోని విల‌క్ష‌ణ‌త వ‌ల్ల ఫ‌స్ట్‌లుక్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాతో ప‌ల్ల‌వి సుభాష్ హీరోయిన్‌గా తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతుంది. త‌నికెళ్ళ‌భ‌ర‌ణి ఈ చిత్రంలో ప్ర‌ముఖ పాత్ర‌ను పోషిస్తున్నారు. గోల్కొండ హైస్కూల్‌, ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రాల‌కు అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన మ‌ల్లిక్‌రామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా డిజిటల్ ట్రైల‌ర్ ను సూప‌ర్‌స్టార్ మ‌హేష్ సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నారు. వై.సుప్రియ‌, జాన్ సుధీర్ పూదోట ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.