close
Choose your channels

మ‌హేష్ - త్రివిక్ర‌మ్ ఏం చేసారో చూడండి..!

Tuesday, October 18, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ తో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే...ఈ షూటింగ్ గ్యాప్ లో మ‌హేష్ ఓ యాడ్ చేసాడు. ఇంత‌కీ మ‌హేష్ చేసిన యాడ్ ఏమిటంటే...అభి బ‌స్ యాడ్.

ఆన్ లైన్ లో అభి బ‌స్ టిక్కెట్లు బుక్ చేసుకోమ‌ని ఈ యాడ్ ద్వారా మ‌న‌కు స‌ల‌హా ఇస్తున్నాడు. ఈ యాడ్ లో మ‌హేష్ తో పాటు కృష్ణుడు న‌టించాడు. కృష్ణుడు ఫోన్ మాట్లాడుతూ...

సున్నుండ‌లు చేసావ్ క‌దా పూతరేకులు మ‌ర‌చిపోకూ రేపు పొద్దునే వ‌చ్చేస్తానులే అంటే...ప‌క్క‌నే ఉన్న‌మ‌హేష్ గార్లు మ‌ర‌చిపోయారు ఇందాక లిస్ట్ లో..! అంటాడు. కృష్ణుడు...పండ‌గ‌కి ఈసారి కూడా మిస్ అయిపోతాను అనుకున్నాను. ల‌క్కీగా యాప్ దొరికింది అనగానే.... మహేష్ అభి బ‌స్ క‌దా...నా ప్ర‌తి ప్ర‌యాణంలో ఉంటుంది తోడుగా...అంటారు. ఇలా వీరిద్ద‌రి మ‌ధ్య స‌ర‌దా సంభాష‌ణ‌తో ఈ యాడ్ రూపొందించారు. ఇంత‌కీ ఈ యాడ్ ను డైరెక్ట్ చేసింది ఎవ‌రో కాదు...మ‌హేష్ కి మిత్రుడు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.