close
Choose your channels

ధనలక్ష్మి తలుపు తడితే సక్సెస్ పట్ల నిర్మాత ఆనందం

Tuesday, August 4, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ధనరాజ్‌, మనోజ్‌నందం, అనిల్‌కళ్యాణ్‌, శ్రీముఖి, రణధీర్‌, సింధుతులాని, నాగబాబు, తాగుబోతు రమేష్‌లతోపాటు జబర్‌దస్త్‌ బ్యాచ్‌` నటించిన ధనలక్ష్మి తలుపు తడితే` జూలై 31న విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. మాస్టర్‌ సుక్కురామ్‌ సమర్పణలో- భీమవరం టాకీస్‌ పతాకంపై సాయి అచ్యుత్‌ చిన్నారి దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

చాలా చిన్న చిత్రంగా విడుదలైన ధనలక్ష్మి తలుపు తడితే`.. చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించే దిశగా, విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతుండడం ఎంతో సంతోషాన్నిస్తోందని అంటున్నారు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. ధనలక్ష్మి..` సాధిస్తున్న విజయం ఎందరికో స్ఫూర్తినిస్తోందని కూడా ఆయన అన్నారు.

కథ-కథనాలే హీరోహీరోయిన్లని నమ్మి తాము చేసిన ప్రయత్నం ఫలించడం పట్ల రామసత్యనారాయణ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధనలక్ష్మి..` ఇస్తున్న స్ఫూర్తితో మరిన్ని మంచి చిన్న సినిమాలు రూపొందుతాయని తుమ్మలపల్లి అన్నారు. ముఖ్యంగా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన సాయి అచ్యుత్ కి చాలా మంచి పేరు వస్తోందని. పలువురు నిర్మాతలు ఆల్రెడీ అతనితో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.