close
Choose your channels

మనోజ్ టైటిల్....

Friday, September 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గుంటూరు టాకీస్ అని ఊరు పేరుతో ప్ర‌వీణ్ స‌త్తార్ చేసిన సినిమా మంచి టాక్ సాధించుకుంది. ఇప్పుడు అలాంటి టైటిల్‌నే మ‌రో సినిమాకు పెట్ట‌నున్నారు ఆ టైటిలే `గుంటూరోడు`. క్లాప్ప్ అండ్ విజిల్స్ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై మ‌నోజ్ హీరోగా స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమాకు `గుంటూరోడు` అనే టైటిల్‌ను నిర్ణ‌యించార‌ని స‌మాచారం.

ఈ చిత్రంలో మ‌నోజ్ స‌ర‌స‌న‌ `కంచె` ఫేమ్ ప్ర‌గ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇందులో గొడ‌వ‌లు చేసే యువ‌కుడి పాత్ర‌లో మ‌నోజ్ క‌నిపిస్తాడట‌. అంటే ప్రేక్ష‌కుల‌కు గుంటూరు కారంలాంటి యాక్ష‌న్‌ను ప‌రిచ‌యం చేయ‌నున్నాడన్న‌మాట‌. సంప‌త్ ఈ చిత్రంలో విల‌న్‌గా న‌టిస్తున్నాడ‌ట‌. హీరో, విల‌న్ మ‌ధ్య పోరు ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమాను డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కులు ముందుకు తీసుకురావడానికి యూనిట్ స‌న్నాహాలు చేస్తుంది. త్వ‌ర‌లోనే సినిమా టైటిల్‌కు సంబంధించిన అదికార‌క ప్ర‌క‌ట‌న రావ‌చ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.