close
Choose your channels

'16' ట్రైలర్ కు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అభినందన...

Monday, February 20, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డం చిత్రాల్లోవిభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించి త‌న‌దైన గుర్తింపు పొందిన విల‌క్ష‌ణ న‌టుడు ర‌హ‌మాన్. రీసెంట్‌గా త‌మిళంలో సూప‌ర్‌హిట్ మూవీ `ధృవంగ‌ళ్ ప‌దినారు` సినిమాతో మ‌రో స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు రెహ‌మాన్‌. ఈ చిత్రాన్నిశ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై తెలుగులో `16` అనే పేరుతో చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ విడుద‌ల చేస్తున్నారు.

తెలుగులో ఇటీవ‌ల విడుద‌ల 16 సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌, ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ వ‌స్తుంది. సినీ ప్ర‌ముఖులంద‌ర‌రూ ఈ సినిమా ట్రైల‌ర్ బావుంద‌ని అప్రిసియేట్ చేస్తున్నారు. `16 ట్రైల‌ర్ చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది..ర‌హ‌మాన్‌గారు ఈ చిత్రం హిట్‌తో మ‌ళ్ళీ ఇండ‌స్ట్రీకి బ్యాక్ అయ్యారు` అంటూ రాకింగ్ స్టార్ మంచు త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో సినిమాను అభినందించారు. కార్తీక న‌రేన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగులో త్వ‌ర‌లో విడుద‌ల‌వుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.