close
Choose your channels

'రక్షకభటుడు' పాటను విడుదల చేసిన మారుతి

Tuesday, April 25, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ర‌క్ష‌, జ‌క్క‌న్న వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాలు త‌ర్వాత ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ ద‌ర్శ‌క‌త్వంలో సుఖీభ‌వ మూవీస్ బ్యాన‌ర్‌పై ఎ.గురురాజ్ నిర్మించిన చిత్రం `ర‌క్ష‌క‌భ‌టుడు`. ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ చేసిన ఈ చిత్రం మే నెల ప్ర‌థ‌మార్థంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఓ సాంగ్ మాత్ర‌మే ఉంది. శేఖ‌ర్ చంద్ర సంగీతం అందించిన ఈ పాట‌ను ద‌ర్శ‌కుడు మారుతి విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా...

మారుతి మాట్లాడుతూ..., ర‌క్ష‌, జ‌క్క‌న్న సినిమాల స‌క్సెస్ త‌ర్వాత డైరెక్ట‌ర్ వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా ఇది. ఈ సినిమా వంశీకి హ్యాట్రిక్ హిట్ మూవీగా నిలుస్తుంది. పోలీస్ గెట‌ప్‌లోని ఆంజ‌నేయ స్వామి మోష‌న్ పోస్ట‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అంద‌రిలో ఓ క్యూరియాసిటీని పెంచింది. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆస‌క్తి క‌లిగింది. కాసర్ల‌శ్యాం రాసిన పాట బావుంది. సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఎంటైర్ టీంకు అభినంద‌న‌లు అన్నారు.

చిత్ర నిర్మాత ఎ.గురురాజ్ మాట్లాడుతూ... రియ‌ల్ ఎస్టేట్ రంగంలో రాణించిన నాకు సినిమాలంటే ఎంతో ఆస‌క్తి ఉంది. అందువ‌ల్ల‌నే నేను ఈ సినిమాతో నిర్మాత‌గా మారాను. జ‌క్క‌న్న సినిమాలో నేను కూడా ఒక క్యారెక్ట‌ర్ చేశాను. ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలో వంశీకృష్ణ‌గారు నాకు ఈ క‌థ‌ను వినిపించారు. బాగా న‌చ్చ‌డంతో సినిమా నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌య్యాను. ముఖ్యంగా వంశీ చెప్పిన క్లైమాక్స్ విని ఒళ్ళు జ‌ల‌ద‌రించింది. క‌థ‌ను ఎలా చెప్పారో అలాగే తెర‌కెక్కించారు. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడ‌నేదే ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో, ఆంజ‌నేయ‌స్వామి గెట‌ప్‌లోఉన్న దెవ‌ర‌నే ప్ర‌శ్న అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తించింది. వంశీకృష్ణ‌గారు సినిమాలోని ప్ర‌తి స‌న్నివేశాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. శేఖ‌ర్ చంద్రగారి మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళుతుంది. మ‌ల్హ‌ర్‌భ‌ట్ జోషి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు హైలైట్ అవుతుంది అని తెలిపారు.
సినిమాలో చాలా మంచి క్యారెక్ట‌ర్ చేశాను. నా క్యారెక్ట‌ర్ చుట్టూనే సినిమా క‌థంతా న‌డుస్తుందని రిచా ప‌న‌య్ తెలుప‌గా, జ‌క్క‌న్న‌లో రెండుసాంగ్స్ రాశాను. నాపై న‌మ్మ‌కంతో ఈ సినిమాలో ఒకే ఒక మాస్ ట‌చ్ ఉన్న సాంగ్‌ను రాసే అవ‌కాశం ఇచ్చినంద‌కు ద‌ర్శ‌క నిర్మాత‌లకు ధ‌న్య‌వాదాల‌ని కాస‌ర్ల‌శ్యాం చెప్పారు. ఇది హ‌ర్ర‌ర్‌, స‌స్పెన్సో, థ్రిల్ల‌రో అని చెప్ప‌లేని డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీ ఆడియెన్స్‌ను ప్ర‌తి సీన్ ఆక‌ట్టుకుంటుంద‌ని శేఖ‌ర్ చంద్ర తెలిపారు.

వంశీకృష్ణ ఆకెళ్ళ మాట్లాడుతూ ... శేఖ‌ర్ చంద్ర‌గారి గ‌త చిత్రాల మ్యూజిక్ విని మాస్ ట‌చ్ ఉండే మ్యూజిక్ చేస్తాడా అనిపించింది నాకు, కానీ శేఖ‌ర్ చంద్ర‌గారు ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యూజిక్ అందించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా కుదిరింది. ప్రొడ్యూస‌ర్ రియ‌ల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారో, సినిమా రంగంలో కూడా అలాంటి స‌క్సెస్‌ను సొంతం చేసుకోవాల‌ని కోరుకుంటున్నాను. మోష‌న్ పోస్టర్‌కు, టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆంజ‌నేయ‌స్వామి గెట‌ప్‌లో ఉన్న హీరో ఎవ‌ర‌నే ఆస‌క్తి అంద‌రిలో కలిగింది. మే ప్ర‌థ‌మార్థంలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.