close
Choose your channels

బాలయ్య వందో సినిమాలో మోక్షజ్న...

Friday, January 8, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి న‌ట సింహం బాల‌క్రిష్ణ న‌టించిన 99వ సినిమా డిక్టేట‌ర్ ఈనెల 14న రిలీజ్ అవుతుంది. ఇక నంద‌మూరి వంశాభిమాన‌లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం బాల‌య్య వందో చిత్రం. ఈ చిత్రాన్ని సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాస‌రావు తెర‌కెక్కించ‌నున్నారు. బాల‌య్య‌, సింగీతం కాంబినేష‌న్ లో రూపొందిన ఆదిత్య 369 సినిమా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ గా ఆదిత్య 999 టైటిల్ తో ఓ చిత్రం రూపొందిస్తుండ‌డం...ఈ చిత్రం బాల‌య్య వందో చిత్రం అవుతుండ‌డం విశేషం.

ఈ భారీ క్రేజీ మూవీని బాల‌య్య పుట్టిన‌రోజైన జూన్ 10న‌ గ్రాండ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...ఈ క్రేజీ మూవీలో బాల‌య్య న‌ట వార‌సుడు మోక్ష‌జ్న న‌టిస్తున్నాడ‌ని స‌మాచారం. ఈ చిత్రంలో బాల‌య్య రాజు గా, మోక్ష‌జ్న యువ రాజుగా న‌టిస్తున్నార‌ట‌. బాల‌య్య వందో చిత్రం, బాల‌య్య వార‌సుడు మోక్ష‌జ్న మొద‌టి చిత్రం ఈ రెండూ ఒకే చిత్రం ద్వారా జ‌రిగితే ఇక నంద‌మూరి అభిమానుల‌కు పండ‌గే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.