close
Choose your channels

మ‌హేష్ క‌థ పై క్లారిటీ ఇచ్చిన మురుగుదాస్

Saturday, January 9, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్ స్టార్ మ‌హేష్, క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్...ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో రూపొంద‌నున్న చిత్రం త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే ఈ సినిమా క‌థ గురించి తాజాగా ఓ వార్త ప్ర‌చారంలో ఉంది. అదేమిటంటే...మురుగుదాస్...అజిత్ తో ఓ సినిమా చేయాల‌నుకున్నారు. కానీ కుద‌ర‌లేదు. ఆ క‌థ‌తోనే మ‌హేష్ తో సినిమా చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

ఈ విష‌యం పై మురుగుదాస్ స్పందిస్తూ...ఆ వార్త‌లో నిజం లేద‌ని...మ‌హేష్ తో చేసే సినిమాకి కొత్త క‌థ‌ను సిద్దం చేసాన‌ని చెప్పారు. ఈ చిత్రాన్నిఠాగూర్ మ‌ధు, ఎన్.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్ సంతోష్ శివ‌న్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ హ‌రీస్ జైరాజ్..ఇలా టాప్ టెక్నీషియ‌న్స్ తో రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.