close
Choose your channels

చైతు మూవీ రైట్స్ ద‌క్కించుకున్న టాప్ ప్రొడ్యూస‌ర్..!

Tuesday, October 25, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన ప్రేమ‌మ్ ద‌స‌రా కానుక‌గా రిలీజై ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మూవీ ఇచ్చిన స‌క్సెస్ సంతోషంలో చైతు సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చైత‌న్య‌, మంజిమ మోహ‌న్ జంట‌గా గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కించిన సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రాన్ని న‌వంబ‌ర్ 11న రిలీజ్ చేయ‌నున్నార‌ని తెలిసింది.

ఏమాయ చేసావే త‌ర్వాత చైత‌న్య‌, గౌత‌మ్ మీన‌న్ క‌లిసి న‌టించ‌డం, ప్రేమ‌మ్ స‌క్సెస్ త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రం పై మంచి క్రేజ్ ఏర్ప‌డింది. దీంతో ఈ మూవీ నైజాం రైట్స్ ను ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ద‌క్కించుకున్న‌ట్టు స‌మాచారం. ఏమాయ చేసావే చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చైత‌న్య, గౌత‌మ్ మీన‌న్ కాంబినేష‌న్ సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రంతో కూడా సంచ‌ల‌నం సృష్టిస్తుందేమో చూడాలి..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.