close
Choose your channels

చైతు ప్రేమ‌మ్ సెన్సార్ పూర్తి..!

Tuesday, September 27, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తెర‌కెక్కించిన ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ ప్రేమ‌మ్. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 7న‌ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో చైతు స‌ర‌స‌న శృతిహాస‌న్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, మ‌డోనా సెబాస్టియ‌న్ న‌టించారు. ఇటీవ‌ల ప్రేమ‌మ్ ట్రైల‌ర్ కి 2 మిలియ‌న్ వ్యూస్ రావ‌డం, ఆడియో స‌క్సెస్ అవ్వ‌డంతో ప్రేమ‌మ్ టీమ్ స‌క్సెస్ పై మ‌రింత న‌మ్మ‌కంగా ఉన్నారు. మ‌ల‌యాళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన ప్రేమ‌మ్ తెలుగులో కూడా అదే స్ధాయిలో విజ‌యం సాధిస్తుందని ఆశిద్దాం..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.