నాగశౌర్య కొత్త సినిమా టైటిల్...
Send us your feedback to audioarticles@vaarta.com
చందమామ కథలు చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నాగశౌర్య తర్వాత ఉహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా, జాదూగాడు, జో అచ్యుతానంద, కళ్యాణ వైభోగమే వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. ఉహలు గుసగుసలాడే సినిమా మాత్రమే మంచి విజయాన్ని సాధించింది. మిగిలిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినవే. ఇప్పుడు కాస్తా గ్యాప్ తీసుకున్న నాగశౌర్య కొత్త సినిమాను స్టార్ట్ చేశాడట. ఈ సినిమాకు అమ్మమ్మగారిల్లు అనే టైటిల్ పరిశీలనలో ఉందట. త్వరలోనే ప్రొడక్షన్ హౌస్, దర్శక నిర్మాతల వివరాలు అధికారకంగా తెలుస్తాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.