close
Choose your channels

యంగ్ డైరెక్టర్ తో నాగ్

Saturday, July 15, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కింగ్ నాగార్జున ఇప్పుడు `రాజుగారి గ‌ది2` సినిమా చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత నాగార్జున చేయ‌బోయే సినిమా ఏంట‌నేది తెలియ‌డం లేదు. నాగ‌చైత‌న్య‌, అఖిల్ సినిమాల నిర్మాణంలో నాగార్జున బిజీగా ఉన్నారు. రాజుగారి పూర్తి కానుంది. కాబ‌ట్టి నాగ్ కొత్త సినిమాలో యోచ‌న‌లో ఉన్నాడు.

గ‌తేడాది నాగార్జున‌తో `సోగ్గాడే చిన్ని నాయ‌నా` స‌క్సెస్ ఇచ్చిన క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో `బంగార్రాజు` అనే సినిమా తెర‌కెక్కుతుంద‌ని అనుకున్నారు కానీ, స్క్రిప్ట్ రెడీ కాలేదు. దీంతో నాగార్జున ఓ కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌బోతున్నాడు. సదరు ద‌ర్శ‌కుడు చెప్పిన పాయింట్ న‌చ్చ‌డంతో నాగ్ సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ విష‌యాలు వెల్ల‌డ‌వుతాయని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. నాగార్జున త‌న స్వంత నిర్మాణ సంస్థ‌లో చైత‌న్య‌తో `రారండోయ్ వేడుక చూద్దాం` సినిమా చేశాడు. ఇప్పుడు అఖిల్‌తో ఓ సినిమా, చైతుతో మ‌రో సినిమా నిర్మిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.