close
Choose your channels

నవీన్ డేడికేషన్ చూసి షాకయ్యాను..అతని హార్డ్ వర్కే సక్సెస్ అందిస్తుంది - మహేష్ బాబు

Tuesday, September 27, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు విజ‌య‌నిర్మ‌ల మ‌న‌వ‌డు న‌వీన్ హీరోగా గిరి తెర‌కెక్కించిన చిత్రం నందిని న‌ర్సింగ్ హోమ్. ఈ టైటిల్ కి ఇక్క‌డ అంతా క్షేమ‌ము అనేది ట్యాగ్ లైన్. న‌వీన్, నిత్యా, శ్రావ్య హీరో, హీరోయిన్స్ గా న‌టించిన నందిని న‌ర్సింగ్ హోమ్ చిత్రాన్ని ఎస్.వి.పి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై రాధా కిషోర్ జి, భిక్ష‌మ‌య్య సంగం సంయుక్తంగా నిర్మించారు. అచ్చు సంగీతం అందించిన నందిని న‌ర్సింగ్ హోం ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో హైద‌రాబాద్ జె.ఆర్.సి క‌న్వెష‌న్లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ సూప‌ర్ స్టార్ కృష్ణ‌, విజ‌య‌నిర్మ‌ల‌ బిగ్ సీడీను ఆవిష్క‌రించ‌గా, ఆడియో సీడీను మ‌హేష్ బాబు ఆవిష్క‌రించి తొలి సీడీని కృష్ణ‌కు అంద‌చేసారు.
ఈ సంద‌ర్భంగా సూపర్‌స్టార్‌ కృష్ణ మాట్లాడుతూ... 50 సంవత్సరాల క్రితం తేనెమనసులు సినిమాలో ఆదుర్తి సుబ్బారావుగారు నాతో సహా చాలా మంది కొత్తవాళ్ళతో సక్సెస్‌ ఫుల్‌ మూవీ తీశారు. తొలి సినిమాలో ఎలా యాక్ట్‌ చేయాలో కూడా తెలియదు. ఆయన అందరికీ ట్రైనింగ్‌ ఇచ్చి సినిమా చేశారు. అయితే ఈ జనరేషన్‌లో అందరూ అన్ని రంగాల్లో ట్రయినింగ్‌ తీసుకుని సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అలాగే నవీన్‌ కూడా ఫైట్స్‌, డ్యాన్స్‌లతో పాటు వైజాగ్‌ సత్యానంద్‌గారి వద్ద నటనలో ట్రయినింగ్‌ తీసుకుని హీరోగా పరిచయం అవుతున్నాడు. తనకు ప్రేక్షకుల ఆశీర్వాదం ఉంటుందని, నవీన్‌ సక్సెస్‌ఫుల్‌ సినిమాలు చేయాలని కోరుకుంటూ ఈ సినిమా దర్శక నిర్మాతలకు అభినందనలు తెలియ‌చేస్తున్నాను అన్నారు.
ప్రిన్స్ మహేష్‌ మాట్లాడుతూ...నరేష్‌గారు చాలా గర్వంగా ఉన్నారు. సినిమా పెద్ద హిట్‌ కావాలి. నవీన్‌ చిన్నప్పట్నుంచి బాగా తెలుసు. పోకిరి, అతడు సినిమా టైంలో తనతో బాగా పరిచయం ఏర్పడింది. తను మంచి ఎడిటర్‌, కొన్ని సీన్స్‌ బాగుండాలని తనను కలిశాం కూడా. తను ఎడిటర్‌గా మంచి టాలెంటెడ్‌ పర్సన్‌. నవీన్‌ ఎడిటర్‌గా ఉన్నప్పుడు ఏం కావాలనుకుంటున్నావ్‌ అని అడిగాను. యాక్ట్‌ చేయాలనుకుంటున్నాను అన్నా.. అన్నాడు. తను అప్పుడు లావుగా ఉండేవాడు. దాంతో తను జోక్‌ చేస్తున్నాడు అని అనుకున్నాను. కానీ ఒక సంవత్సరం తర్వాత తనను కలిశాను. తను సన్నబడటమే కాదు, సిక్స్‌ప్యాక్‌తో ఉన్నాడు. తన డేడికేషన్‌ చూసి షాకయ్యాను. మనం హార్డ్‌ వర్క్‌ చేస్తే సక్సెస్‌ వస్తుందనే విషయాన్ని నేను బాగా నమ్ముతాను. నవీన్‌కి, ఎంటైర్‌ టీంకు ఆల్‌ ది బెస్ట్‌. సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ...నవీన్‌తో నాకు అతడు సినిమా నుండి పరిచయం. అతడు సినిమాకు నవీన్‌ ట్రైలర్‌ కట్‌ చేశాడు. తను మంచి టాలెంటెడ్ టెక్నిషియ‌న్. ఇప్పుడు హీరోగా కూడా జర్నీ స్టార్ట్‌ చేస్తున్నాడని తెలిసి తనకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా దర్శక నిర్మాతలకు, ఇతర నటీనటులు, టెక్నిషియన్స్‌కు ఆల్‌ ది బెస్ట్‌. నవీన్‌ ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ...నేను నవీన్‌ బెస్ట్‌ ఫ్రెండ్స్‌. చిన్నప్పట్నుంచి ఇద్దరం కలిసే పెరిగాం. తన్నులు తినడం నుండి ఇప్పడు సినిమాలు వరకు కలిసే ఉన్నాం. తనకు ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలి. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అచ్చును మేం కోకోనట్‌ అని పిలుస్తుంటాం. ఈ సినిమాలో మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
నరేష్‌ మాట్లాడుతూ...నవీన్‌ ఎడిటర్‌ అయ్యి మంచి టెక్నిషియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. సడెన్‌గా వచ్చి ఓ రోజు హీరో అవుతానంటే షాకయ్యాను. పెద్దల ప్రోత్సాహం, నాయనమ్మ కల, ప్రేక్షకుల అభిమానంతో ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. కథ వినగానే మంచి సినిమా అవుతుందని, ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే ఓకే చేశాం. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఈమూవీని నిర్మించారు. దిల్‌రాజు సినిమా చూసి సినిమా చాలా బావుంది. చివరి ముప్పై నిమిషాలు ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని చెప్పారు. మంచి టీం ఈ సినిమాకు పనిచేశారు. అచ్చు మంచి మ్యూజిక్‌ ఇచ్చారు అన్నారు.
నవీన్‌ విజయ్‌కృష్ణ మాట్లాడుతూ...చిన్నప్పట్నుంచి మహేష్‌ అన్న అంటే చాలా ఇష్టం. ఎంతో బిజీ షెడ్యూల్‌ ఉన్నా, టైం కేటాయించి ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. నాకు ఇన్‌స్పిరేషన్‌ కూడా మహేష్‌ అన్నే. మా విజయ్‌కృష్ణమూవీస్‌ ప్రివ్యూ థియేటర్‌లో తాతగారు, నాన్నమ్మగారు, నాన్న సినిమాలు చూసి పెరిగాను. నేను ఇక్కడ ఉండటానికి కారణం కృష్ణగారు, నాన్నమ్మ, మహేష్‌ అన్న, నాన్నగారే కారణం. ఇక సినిమా విషయానికి వస్తే... గిరిగారు సినిమాను అద్బుతంగా తీశారు. కథను నేరేట్‌ చేసినప్పుడే కథ బాగా నచ్చింది. నిర్మాతలు రాధాకిషోర్‌గారు, బిక్షమయ్య సంగం గారు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమా తీశారు. నిర్మాతలకు థాంక్స్‌. అచ్చు నా మిత్రుడు. మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. అద్భుతమైన ట్రాక్‌ ఇచ్చాడు. నా సహ నటులు నిత్య, శ్రావ్యలు ఎంతగానో సపోర్ట్‌ చేశారు. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసినప్పటి నుండి నాకు వచ్చిన రెస్పాన్స్‌ చూసి ఆనందమేసింది. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌ అన్నారు.
చిత్ర దర్శకుడు పి.వి.గిరి మాట్లాడుతూ...నవీన్‌గారు కథ విని ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు. తను ఏం చెబితే అది చేసేవారు. క్లైమాక్స్‌లో ఓ సీన్‌లో తన నటన చసి మహేష్‌బాబుగారు గుర్తుకు వచ్చారు. మహేష్‌బాబు, మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు మంచి సినిమా అవుతుంది అన్నారు.
రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ...నరేష్‌ నాకు మంచి మిత్రుడు. నవీన్‌ నా బిడ్డలాంటివాడు. దర్శక నిర్మాతలకు, టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు.
కోటి మాట్లాడుతూ...నా పిలుపే ప్రభంజనం సినిమాతో కృష్ణగారే మాకు ఇండస్ట్రీలో రావడానికి కారణమయ్యారు. అలాగే విజయ్‌నిర్మలగారి దర్శకత్వంలో కూడా నేను మ్యూజిక్‌ చేశాను. నరేష్‌ తనయుడు విజయ్‌కృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను. అచ్చు మంచి సంగీతాన్ని అందించాడు అన్నారు.
ఈ కార్యక్రమంలో సుధీర్‌బాబు, ఎం.ఎస్‌.రాజు, బి.గోపాల్‌, ఎ.కోదండరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.