close
Choose your channels

నాని క్లారిటీ ఇచ్చేశాడు...

Saturday, July 15, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తున్న నేచుర‌ల్ స్టార్ నాని ఇప్పుడు దిల్‌రాజు నిర్మాణంలో `ఎంసిఎ` సినిమా చేస్తున్నాడు. త‌దుప‌రి నాని ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై ఈరోజు నాని అంద‌రికీ క్లారిటీ ఇచ్చేశాడు. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ద్వారా నాని త‌న నెక్ట్స్ మూవీని మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌కత్వంలో చేస్తున్నాడు.

ఈ సినిమాకు `కృష్ణార్జున యుద్ధం` అనే టైటిల్‌ను క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. ఇందులో నాని ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా విడుద‌లైంది. మ‌రి కృష్ణుడిగా, అర్జునుడిగా నాని ఎలా మెప్పిస్తాడో చూడాల్సిందే. నాని రీసెంట్ మూవీ నిన్ను కోరి మంచి విజ‌యాన్ని అందుకుంది. ఈ సినిమా స‌క్సెస్ బ్లాక్ బ‌స్ట‌ర్ సెలబ్రేష‌న్స్‌ను విజ‌య‌వాడ‌లో రేపు నిర్వ‌హించ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.