close
Choose your channels

గల్ఫ్ కథానాయకుని ప్రచార చిత్రం ఆవిష్కరించిన నేచురల్ స్టార్ నాని

Thursday, June 29, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో చేతన్ మద్దినేని హీరోగా, యక్కలి రవీంద్రబాబు, యమ్. యస్. రామ్ కుమార్ నిర్మిస్తున్న గల్ఫ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా గల్ఫ్ చిత్ర కథానాయకుడి ప్రచార చిత్రాన్ని ప్రముఖ హీరో “ నేచురల్ స్టార్ నాని “ తన చేతుల మీదుగా ఆవిష్కరించారు.

హీరో నాని మాట్లాడుతూ “ గల్ఫ్ “ చిత్రం ద్వారా, శివ పాత్రలో తెరముందుకు వస్తున్న చేతన్ మద్దినేని గల్ఫ్ వలసల జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్న బ్లూ కాలర్ వర్కర్లకు ప్రతినిధిగా ఈ సినిమాలో నటిస్తున్నాడు . దాదాపు ఇరవై ఐదు లక్షల మంది తెలుగు రాష్ట్రాల నుండి తమ ఉపాధి కోసం వలస వెళ్లారు . అక్కడ వారి జీవన చిత్రాన్ని హృద్యంగా ఆలోచింప చేస్తూనే వినోదాన్ని, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నింటిని కలిపి ఈ చిత్రాన్ని దర్శక నిర్మాతలు మలిచారు . ఇందులో ” శివ “ గా నటిస్తున్న చేతన్ ఈ చిత్రం ద్వారా మంచి పేరుని, చిత్రం మంచి విజయాన్ని అందుకుంటుందని తను ఆశిస్తున్నానని తెలిపారు.

గల్ఫ్ చిత్రం హీరో చేతన్ మద్దినేని మాట్లాడుతూ “ నేచురల్ స్టార్ నాని “ గారి చేతుల మీదగా తన లుక్ లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది . ఈ చిత్రంలో నా పాత్ర ప్రేక్షకులకు పది కాలాలపాటు గుర్తుండి పోతుంది . దుబాయ్, రసల్ ఖైమాలో షూటింగ్ జరుపుకున్న ఈ సరిహద్దులు దాటిన ప్రేమ కథ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది " అన్నారు.

ఈ చిత్రం ద్వారా గల్ఫ్ సమస్యల పట్ల అవగాహన కలుగుతుందని, సీనియర్ నటీనటులు, టెక్నీషియన్స్ పని చేసిన ఈ చిత్రం అందరిని అలరిస్తుందని సమావేశంలో పాల్గొన్నదర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాతలు యక్కలి రవీంద్రబాబు, ఎగ్జ్ క్యుటివ్ ప్రొడ్యూసర్ బాపిరాజు పేర్కొన్నారు .
చేతన్ మద్దినేని, డింపుల్, సంతోష్ పవన్, అనిల్ కళ్యాణ్, సూర్య ( పింగ్ పాంగ్), నల్ల వేణు, నాగినీడు, డిగ్గీ, పోసాని కృష్ణమురళి, జీవా, తనికెళ్ళ భరణి, తోటపల్లి మధు, భద్ర, బిత్తిలి సత్తి, ప్రభాస్ శ్రీను, శంఖరాభరణం రాజ్యలక్ష్మి, తీర్ద, సన, యఫ్ యం బాబాయ్, మహేష్, శివ తదితరులు తారాగణం.

కెమెరా : యస్. వి. శివరాం, ఎడిటింగ్ : కళ్యాణ్ సామ్యుల్, సంగీతం : ప్రవీణ్ ఇమ్మడి, మాటలు : పులగం చిన్నారాయణ, సహ నిర్మాతలు : డాక్టర్ ఎల్ . ఎస్. రావు, విజయ్ కుమార్ కుర్రా, రాజా.జి, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : బి. బాపిరాజు, నిర్మాతలు : యక్కలి రవీంద్రబాబు, యమ్. యస్. రామ్ కుమార్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : పి . సునీల్ కుమార్ రెడ్డి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.