బాలీవుడ్‌కి నాని మూవీ...
Send us your feedback to audioarticles@vaarta.com
వరుస చిత్రాలను సాధిస్తున్న నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో నటించిన చిత్రం 'నిన్ను కోరి'. డి.వి.వి.దానయ్య నిర్మించిన ఈ చిత్రం జూలై 7న విడుదలై సూపర్‌హిట్ అయ్యింది. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయనున్నారట.
ఈ చిత్ర సమర్పకుడుగా వ్యవహరించిన కోనవెంకట్ బాలీవుడ్ మేకర్ సంజయ్ లీలా బన్సాలీతో రీమేక్ గురించి చర్చించాడట. నిన్నుకోరి సినిమా విడుదలకు ముందు ఈ సినిమా బాలీవుడ్ మూవీ హమ్ దిల్ దే చుకే సనమ్లా ఉందని వార్తలు వినిపించాయి.
దీనిపై కూడా వీరి మధ్య చర్చ జరిగిందట. అయితే సంజయ్ లీలా బన్సాలీ సినిమా చూసి రీమేక్ చేయడానికి అంగీకరించాడట. నాని పాత్రలో వరుణ్ ధావన్ చేయనున్నాడని వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.