close
Choose your channels

గుమ్మడికాయ కొట్టేసిన 'నాన్నకు ప్రేమతో..'

Tuesday, January 5, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, ఆర్య సుకుమార్‌ కాంబినేషన్‌లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం నాన్నకు ప్రేమతో..`. జనవరి 4తో ఈ చిత్రానికి సంబంధించిన టోటల్‌ షూటింగ్‌ పూర్తయింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుద చేయడానికి నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ-జనవరి 4తో ఈ చిత్రానికి సంబంధించిన టోటల్‌ షూటింగ్‌ పూర్తయింది. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే అత్యంత కాస్ట్‌లియస్ట్‌ చిత్రంగా నాన్నకు ప్రేమతో` చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా చాలా లావిష్‌గా నిర్మిస్తున్నాం. దర్శకుడు సుకుమార్‌ టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం`` అన్నారు.

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.