close
Choose your channels

ఇండియాలో నెం 2 - నరుడా డోనరుడా ట్రైలర్..!

Friday, September 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ న‌టించిన తాజా చిత్రం న‌రుడా డోన‌రుడా. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ ను కింగ్ నాగార్జున రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఆత‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ త‌న ఫ్రెండ్ సుమంత్ కోసం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను రిలీజ్ చేసారు. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ విశేషంగా ఆక‌ట్టుకోవ‌డంతో థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ఎలా ఉంటుందో అని ఆస‌క్తిగా ఎదురుచూసారు. అయితే... ఈ ట్రైల‌ర్ అంద‌రి అంచ‌నాల‌ను మించి ఊహించ‌ని విధంగా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది.
ఫేస్ బుక్ & యూట్యూబ్ ఛాన‌ల్ లో కేవ‌లం 24 గంట‌ల్లోనే 1.8 మిలియ‌న్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.అలాగే యూట్యూబ్ లో ఎక్కువ మంది చూసిన వీడియోగా రికార్డ్ క్రియేట్ చేస్తూ ఇప్ప‌టికీ ఇండియా ట్రెండ్స్ లో రెండో స్ధానంలో నిల‌వ‌డం విశేషం. ఈ చిత్రంలో త‌నికెళ్ల భ‌ర‌ణి చెప్పిన‌ట్టుగా 100% స్ట్రైక్ రేట్ తో ఈ ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.ఇదే రియాక్ష‌న్ సినిమాకు కూడా వ‌స్తుంది అనిపిస్తుంది. మ‌రి...ట్రైల‌ర్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన న‌రుడా డోన‌రుడా మూవీ కూడా అంద‌ర్నీ ఆక‌ట్టుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంద‌ని ఆశిద్దాం..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.