close
Choose your channels

నీరాజనం ఆడియో విడుదల

Thursday, September 1, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మగేష్, సభ్యసాచి, కారుణ్య, సన షాలిని నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం నీరాజనం. అవన్ ఆళ్ల దర్శకుడు. మహాలక్ష్మీ మూవీస్ పతాకంపై తెలుగు, తమిళ, ఒరియా భాషల్లో ఈ చిత్రాన్ని దాడి అప్పలనాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర గీతాలు బుధవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు వి.సాగర్ విడుదల చేయగా రవిశంకర్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో బిగ్ సీడీని నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.ఆడియో సీడీని మల్కాపురం శివకుమార్ ఆవిష్కరించించారు.

ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ నీరాజనం మంచి టైటిల్. మంచి ప్లానింగ్‌తో మూడు భాషల్లో నిర్మించిన ఈ సినిమా నిర్మాత పెట్టిన ప్రతి పైసా తిరిగిరావాలి. రవిశంకర్ అందించిన పాటలు అద్భుతంగా వున్నాయి. సభ్యసాచి ఓరియాలో స్టార్ హీరో, షాపింగ్‌మాల్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మగేష్..ఈ ఇద్దరూ కలిసి నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలి అన్నారు. దర్శకుడు అవన్ ఆళ్ల మాట్లాడుతూ ఓ మ్యూజికల్ రియాలిటీ షో నేపథ్యంలో సాగే ముక్కోణ ప్రేమకథా చిత్రమిది. మూడేళ్ల క్రితం చేసుకున్న కథ ఇది. ఏడాది క్రితం నిర్మాతకు చెప్పాను. నాపై నమ్మకంతో కథ వినకుండానే ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు.

నేటి ట్రెండ్‌కు అనుగుణంగా సాగుతుంది అన్నారు. నిర్మాత దాడి అప్పలనాయుడు మాట్లాడుతూ దర్శకుడిపై వున్న నమ్మకంతో తెలుగు, తమిళ, ఒరియా భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. నిర్మాతగా ఇది నా తొలి సినిమా. చాలా కథలు విన్నాను. అయితే అనుకున్న కథను సమర్థవంతంగా తెరకెక్కించగలిగే దర్శకుడైతే బాగుంటుందని అవన్ ఆళ్లను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు రవిశంకర్, మగేష్, సభ్యసాచి, కారుణ్య, సన షాలిని, బన్నీ ప్రకాష్, కెమెరామెన్ మహీశేర్ల, పి.తిలక్ తదితరులు పాల్గొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.