1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

విజయవాడలో ఘనంగా జరిగిన 'నిన్నుకోరి' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్

IndiaGlitz [Monday, July 17, 2017]
Comments

నాని, నివేదా థామస్‌, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కోన ఫిలిం కార్పొరేషన్‌ పతాకాలపై శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నిన్నుకోరి'. ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌ని విజయవాడలో అశేష ప్రేక్షకాభిమానుల మధ్య ఎంతో సందడిగా నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌లో 'నిన్నుకోరి' బ్లాక్‌బస్టర్‌ కేక్‌ను హీరో నాని కట్‌ చేశారు. అనంతరం చిత్ర యూనిట్‌ సభ్యులకు ఆంధ్రప్రదేశ్‌ ఎఫ్‌డిసి చైర్మన్‌ అంబికా కృష్ణ చేతుల మీదుగా షీల్డులు అందజేశారు. ఈ సెలబ్రేషన్స్‌లో 'నిన్ను కోరి' యూనిట్‌ సభ్యులంతా పాల్గొన్నారు.
 
హీరో నాని మాట్లాడుతూ ''వైజాగ్‌లో షూటింగ్‌ చేశాం, అమెరికాలో షూటింగ్‌ చేశాం. హైదరాబాద్‌లో రిలీజ్‌ని ఎంజాయ్‌ చేశాం. మరి విజయవాడలో ఈ సక్సెస్‌ని సెలబ్రేట్‌ చేసుకోకపోతే కంప్లీట్‌ అయినట్టు కాదు అనిపించింది. దానయ్యగారు, కోనగారు ఈ సినిమాని తీసుకొచ్చినందుకు థాంక్స్‌. మా డైరెక్టర్‌ శివకి పేరుకే మొదటి సినిమా. వంద సినిమాలు చేసిన డైరెక్టర్‌లా తీశాడు. నా సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడంటే అది నాకు గర్వంగా వుంటుంది. ఈ సినిమాకి అరుణ్‌, పల్లవి, ఉమ.. ఇదే ఆర్డర్‌. వాళ్ళిద్దరూ మీకు కనెక్ట్‌ అయితేనే ఉమ కనెక్ట్‌ అవుతాడు. ఆది, నివేదా చాలా అద్భుతంగా చేశారు. ఇంత మంచి హిట్‌ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్‌'' అన్నారు.
 
కోన వెంకట్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా హిట్‌ అవ్వడానికి నాని, నివేదా, ఆది కారణమా, మ్యూజిక్‌, మాటలు, స్క్రీన్‌పే కారణమా. ఇవన్నీ కాదు, ప్రేక్షకుల వల్లే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్‌ అయింది. నాని వల్లే ఈ ప్రాజెక్ట్‌ టేకాఫ్‌ అయింది. నివేదా, ఆది ఈ సినిమాకి కుదిరారు'' అన్నారు.
 
అంబికా కృష్ణ మాట్లాడుతూ ''కొన్ని సినిమాలు కళ్ళతో చూస్తాం. మరికొన్ని సినిమాలు మాత్రం మనసుతో చూస్తాం. అలాంటి సినిమాయే 'నిన్నుకోరి'. ఈ సినిమాలో తండ్రికి, కూతురుకి మధ్య ప్రేమ, భార్య, భర్తల మధ్య ప్రేమ.. ఇలా అన్ని రకాలా ప్రేమల గురించి బాగా చూపించారు'' అన్నారు.
 
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ''ఇది చాలా ఎమోషనల్‌ ఎక్స్‌పీరియన్స్‌. మీలో చాలా మంది ఉమలు, పల్లవిలు, అరుణ్‌లు వున్నారు. నిన్నుకోరి సినిమాని లవ్‌ చేసిన మీ అందరికీ థాంక్స్‌'' అన్నారు.
 
నివేదా థామస్‌ మాట్లాడుతూ ''చాలా చాలా థాంక్స్‌. ఇంత ప్రేమ నేను ఎప్పుడూ చూడలేదు. ఉమని, పల్లవిని, అరుణ్‌ని మీ ఫ్యామిలీలో మెంబర్స్‌గా యాక్సెప్ట్‌ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు'' అన్నారు.
 
ఆది పినిశెట్టి మాట్లాడుతూ ''ఈ సినిమాని ఇంత మంచి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చేసిన మీ అందరికీ థాంక్స్‌. తెలుగు సినిమా అంటే ఫైట్స్‌, పాటలు, కామెడీని వుండాలనేవారు. కానీ, ఒక మంచి ప్రేమకథని తీస్తే తప్పకుండా ఆదరిస్తామని మీరు ప్రూవ్‌ చేశారు. ఈ సినిమాలో మంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా థాంక్స్‌'' అన్నారు.డబ్బింగ్ పనుల్లో 'పైసా వసూల్'More News


Puri is ahead of schedule; 'Paisaa Vasool' hitting early?

Ajith's 'Vivegam' scores high in Telugu

Actress trolled for anti-Bigg Boss post

'War for the Planet of the Apes' races past 'Spider-Man'

Wimbledon 2017: Federer's 19th Grand Slam win

'Gautham Nanda' will be among 10 best movies: Sampath

Ravi Teja doesn't even smoke: Mother

Traffic Ramaswamy threatens to commit suicideCopyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Audience will connect to emotions in 'Vaisakham': Avantika
 Rana Promotes 'Nene Raju Nene Mantri' 'Creatively'!
 DIG exposes Sasikala's cushy life in jail, transferred
 Rakul could again work with top director
 Puri is ahead of schedule; 'Paisaa Vasool' hitting early?
 Ajith's 'Vivegam' scores high in Telugu
 Actress trolled for anti-Bigg Boss post
 'War for the Planet of the Apes' races past 'Spider-Man'
 Wimbledon 2017: Federer's 19th Grand Slam win
 'Gautham Nanda' will be among 10 best movies: Sampath
 Ravi Teja doesn't even smoke: Mother
 Traffic Ramaswamy threatens to commit suicide
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.