close
Choose your channels

జూలై 16న విజయవాడలో 'నిన్నుకోరి' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్

Friday, July 14, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దానయ్య డి.వి.వి. నిర్మించిన చిత్రం 'నిన్నుకోరి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో సూపర్‌హిట్‌ చిత్రంగా అందరి ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రానికి అపూర్వ ఆదరణ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు జూలై 16 సాయంత్రం 6 గంటలకు విజయవాడ బందర్‌ రోడ్‌లోని ఎ-1 కన్వెన్షన్‌ సెంటర్‌లో 'నిన్నుకోరి బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌' నిర్వహించేందుకు చిత్ర యూనిట్‌ నిర్ణయించింది. ఈ సెలబ్రేషన్స్‌లో నేచురల్‌ స్టార్‌ నాని, హీరోయిన్‌ నివేదా థామస్‌, ప్రత్యేక పాత్ర పోషించిన ఆది పినిశెట్టితోపాటు టోటల్‌ యూనిట్‌ పాల్గొంటుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.