close
Choose your channels

జనతా గ్యారేజ్ కోసం ఎన్టీఆర్ భారీ ప్లాన్...

Tuesday, January 12, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో...సుకుమార్ తెర‌కెక్కించిన నాన్న‌కు ప్రేమ‌తో చిత్రం ఈనెల 13న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ న‌టించే చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ భారీ ప్లాన్ రెడీ చేస్తున్నాడు. నాన్న‌కు ప్రేమ‌తో..సినిమాలా జ‌న‌తా గ్యారేజ్ లో కూడా డిఫ‌రెంట్ లుక్ లో క‌నిపిస్తే బాగుంటుంద‌ని సీరియ‌స్ గా ఆలోచిస్తున్నారు.
అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండాల‌నేది ఫిక్స్ కాలేదు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...ఎన్టీఆర్..త‌న మార్కెట్ ను మ‌రింత పెంచేలా జ‌న‌తా గ్యారేజ్ సినిమాని తెలుగుతో పాటు త‌మిళ్, మ‌ల‌యాళంలో కూడా ఒకేసారి రిలీజ్ చేసేలా భారీ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో...ప్ర‌మోష‌న్ లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో చెప్ప‌డం విశేషం. శ్రీమంతుడు త‌ర్వాత కొర‌టాల శివ‌, ఎన్టీఆర్ తో రూపొందించే ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 10న ప్రారంభించ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.