close
Choose your channels

రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్...

Monday, July 24, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్‌.రవీంద్ర‌(బాబి) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `జై ల‌వ‌కుశ‌`. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడు. అందులో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న జై పాత్ర‌తో పాటు ల‌వ‌, కుశ పాత్ర‌ల్లో కూడా ఎన్టీఆర్ క‌న‌ప‌డ‌నున్నాడు. అందులో భాగంగా పూణేలో జై పాత్ర‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నార‌ట‌. పూణేలో ఈ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఇంత‌కు పూణేలో ఎందుకు చిత్రీక‌రిస్తున్నారంటే పూణేలోనే ఎన్టీఆర్ బిగ్ బాస్ షో జ‌రుగుతుంది కాబ‌ట్టి.

ఇక జై క్యారెక్ట‌ర్ ఓ రాజ‌కీయ నాయ‌కుడి పాత్ర‌. నెగ‌టివ్ షేడ్స్ ఉంటాయి. స‌రే..ఇంత‌కు ఎన్టీఆర్ ఏ రాజకీయ పార్టీకి చెందిన‌వాడు. అంటే స‌మస‌మాజ్ పార్టీ. త‌న పార్టీ త‌ర‌పున జై ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను ఓట్లు అడుగుతున్న‌ట్లు స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు మ‌రి. `జై ల‌వ‌కుశ‌` సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. నివేదా థామ‌స్‌, రాశిఖ‌న్నా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ సినిమాను నిర్మిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.