close
Choose your channels

డిక్టేటర్ పై పోటీ గురించి స్పందించిన ఎన్టీఆర్...

Saturday, January 9, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో...సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుక‌గా ఈనెల 13న నాన్న‌కు ప్రేమ‌తో...రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నంద‌మూరి న‌ట‌సింహం బాల‌క్రిష్ణ న‌టించిన తాజా చిత్రం డిక్టేట‌ర్ కూడా సంక్రాంతి కానుక‌గా ఈనెల 14న రిలీజ్ అవుతుంది.
టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన సోగ్గాడే చిన్ని నాయ‌నా ఈనెల 15న‌, శ‌ర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా ఈనెల 14న రిలీజ్ అవుతున్నాయి. సంక్రాంతికి మూడు భారీ బ‌డ్జెట్ చిత్రాలు, ఓ యువ హీరో సినిమా మొత్తం 4 సినిమాలు పోటీప‌డుతుండ‌డంతో సంక్రాంతి పోటీ ఆస‌క్తిగా మారింది. పెద్ద సినిమాల‌కు రెండు వారాలు గ్యాప్ ఉంటే బాగుంటుద‌నుకున్న నిర్మాత‌లు ఇలా గ్యాప్ లేకుండా పోటీప‌డి సినిమాలు రిలీజ్ చేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్..? అస‌లు ఈ పోటీ ఎందుకు..? ఇలాంటి ప్ర‌శ్న‌లు మొద‌ల‌య్యాయి. దీనికి తోడు నంద‌మూరి ఫ్యామిలీ హీరోలు బాబాయ్ బాల‌య్య‌, అబ్బాయ్ ఎన్టీఆర్ పోటీప‌డుతుండ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తినిక‌లిగిస్తుంది.
ఈ సంక్రాంతి పోటీ గురించి ఎన్టీఆర్ ని అడిగితే...మా నిర్మాత సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. నేను కేవ‌లం హీరోని మాత్ర‌మే. సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాల‌నేది నిర్ణ‌యించేది నిర్మాతే అంటున్నారు. అలాగే మ‌న‌కు సంక్రాంతి, స‌మ్మ‌ర్, ద‌స‌రా...ఇలా మూడు సీజ‌న్సే ఉన్నాయి. అందుచేత‌...సంక్రాంతి సెల‌వులు క‌ల‌సోస్తాయ‌నే ఉద్దేశ్యంతోనే మా సినిమాని రిలీజ్ చేస్తున్నాం అంటున్నారు. అదీ సంగ‌తి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.