close
Choose your channels

'ఓం నమోవేంకటేశాయ' ఓవర్ సీస్ రైట్స్ ఎంతంటే....

Sunday, September 11, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని నాగార్జున టైటిల్ ప్రాత‌లో కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో సాయికృపా ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి బ్యానర్ పై ఎ. మ‌హేష్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం `ఓం న‌మో వెంక‌టేశాయ‌`. వెంక‌టేశ్వ‌ర‌స్వామి భ‌క్తుడైన హ‌థీరాంబాబా జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

ఈ చిత్రంలో అనుష్క, విమలా రామన్, ప్రగ్యా జైశ్వాల్, సౌరభ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సినిమా అనుకున్న ప్లానింగ్ లో పూర్తయితే సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు ఆలోచన చేస్తున్నారు. నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్ వచ్చిన `అన్నమయ్య`, `శ్రీరామదాసు`, `శిరిడీసాయి` చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో ఈ భక్తిరస చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా నాగార్జున కెరీర్ లో ట్రెండ్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అందుకు ఊతమిస్తూ తెలుగు, తమిళం, హిందీ వెర్షన్స్ లో ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులను ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఆరు కోట్లకు చేజిక్కించుకుందని సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.