close
Choose your channels

నాగ్ ను అభినందించిన ఊపిరి టీమ్..

Tuesday, January 19, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కింగ్‌ నాగార్జున హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన సోగ్గాడే చిన్ని నాయ‌నా భారీ ఓపెనింగ్స్‌ సాధించడమే కాకుండా సంక్రాంతి విన్నర్‌గా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తోంది. ఇండియాలోనూ, ఓవర్సీస్‌లో ట్రెమండస్‌ రెస్పాన్స్‌తో 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం విజ‌య‌వంతంగా ప్రదర్శింప బడుతోంది. కింగ్‌ నాగార్జునతో 'ఊపిరి' చిత్రాన్ని నిర్మిస్తున్న పివిపి సినిమా అధినేత పివిపి 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం సాధించిన ఘనవిజయానికి 'ఊపిరి' టీమ్‌ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ....
పివిపి సినిమా అధినేత పివిపి మాట్లాడుతూ ''రొమాంటిక్‌ హీరో అక్కినేని నాగార్జునగారు నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' 2016 సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచినందుకు చాలా సంతోషంగా వుంది. ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్స్‌లో సూపర్‌హిట్‌ టాక్‌తో ప్రదర్శింపబడుతున్న ఈ చిత్రం ఇండియాలోనూ, ఓవర్సీస్‌లోనూ అద్భుతమైన కలెక్షన్స్‌ సాధిస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంతో ఇంతటి ఘనవిజయం సాధించిన అక్కినేని నాగార్జునగారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.