close
Choose your channels

సమస్యల్లో 'ఆక్సిజన్'....?

Tuesday, October 25, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌`. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అయితే ఇప్పుడు సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంద‌ర్భంలో హీరో గోపీచంద్‌, ద‌ర్శ‌కుడు ఎ.ఎం.జ్యోతికృష్ణ మ‌ధ్య విబేదాలు తలెత్తాయ‌ట‌.

షూటింగ్‌లో వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌తో సినిమా ఇప్పుడు హోల్డ్ అయ్యింద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. రీసెంట్‌గా గోపీచంద్‌, బి.గోపాల్ సినిమా ఆర్ధిక స‌మ‌స్య‌ల వ‌ల్ల ఆగిపోయి మళ్లీ విడుద‌ల‌కు రెడీ అవుతున్న స‌మ‌యంలో ఆక్సిజ‌న్ సినిమాకు స‌మ‌స్య రావ‌డం ఇబ్బందే మ‌రి. `ఆక్సిజ‌న్` స‌మ‌స్య ఏ కొలిక్కి వ‌స్తుందో చూడాలి. గోపీచంద్ ఇప్పుడు సంపత్ నంది ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.