close
Choose your channels

పవన్ కు తమ్ముడు బహుమానం...

Wednesday, March 1, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు కాట‌మ‌రాయుడు చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ప‌వ‌న్ అన్న‌గా న‌టిస్తుంటే ప‌వ‌న్‌కు త‌మ్ముళ్లుగా శివ‌బాలాజీ, చైత‌న్య‌కృష్ణ న‌టిస్తున్నారు. ఈ సినిమాలో న‌టిస్తున్న శివబాలాజీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఏదైనా గిఫ్ట్ ఇద్దామ‌నుకున్నాడు. అయితే ఏ గిఫ్ట్ ఇస్తే బావుంటుందో ఆలోచించి డెహ్ర‌డూన్‌లో ఓ ఆయుధాలు త‌యారుచేసే ఒక వ్య‌క్తిని క‌లిసి ఒక క‌త్తిని, దానిపై జ‌న‌సేన గుర్తు ఉండేలా డిజైన్ చేయించి త‌యారు చేయించాడ‌ట‌. దాన్ని సెట్స్‌లో ప‌వ‌న్‌కు అందించాడ‌ట‌. బంగారు వ‌ర్ణంలోని ఈ క‌త్తిపై సంభ‌వామి యుగే యుగే అనే వ‌ర్డ్స్ కూడా ముద్రించ‌డంతో పాటు జ‌న‌సేన ఆవిర్భావంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రూపును కూడా ముద్రించారు. ఆ గిఫ్ట్ చూసిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎంతో సంతోషించాడ‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.