close
Choose your channels

ఇల్లు కొనే యోచనలో పవన్ హీరోయిన్

Monday, July 10, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అను ఇమ్మాన్యుయల్‌ మూలాలు కేరళ. అయితే పుట్టి పెరిగిందంతా అమెరికాలోనే. తండ్రి మలయాళ నిర్మాత కావడంతో చిన్న వయసులో 'స్వప్న సంచారి' అనే సినిమాలో బాలనటిగా చేసింది. తర్వాత 'యాక్షన్‌ హీరో బిజ్జు'లో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో మాత్రం నాని 'మజ్ను' చిత్రంతో పరిచయమైంది. తెలుగులో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ ముందు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలంటే భయపడిందట. అందుకు కారణం తనకు భాష రాకపోవడమే.
మలయాళంలో నటించడం ఇబ్బందిగా అనిపించలేదు. కానీ తెలుగులో మొదటి సినిమా చేయాలనుకున్నప్పుడు మాత్రం కాస్తా భయపడిన మాట వాస్తవమే. కానీ తెలుగు ప్రేక్షకులు నన్ను చాలా బాగా రిసీవ్‌ చేసుకున్నారు. ఇప్పుడు నాకు హైదరాబాదే నా సొంత ఊరు అనే అభిప్రాయం కలుగుతుంది. కేరళలో కన్నా ఇక్కడ ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాను. త్వరలోనే ఇక్కడ ఒక ఇల్లు కొనాలనే ఆలోచనలో ఉన్నాను. ఇక్కడ ఇల్లు ఉంటే అమ్మను తీసుకురావచ్చు అంటూ హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని తెలియచేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.