close
Choose your channels

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనసులో మాటలు

Saturday, April 9, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాని తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేసారు. బాలీవుడ్ లో ఫ‌స్ట్ టైమ్ ప‌వ‌న్ సినిమా రిలీజ్ చేయ‌డంతో అంద‌రిలో ఆస‌క్తి ఏర్ప‌డింది. అయితే మీడియాకి కాస్త దూరంగా ఉండే ప‌వ‌న్...బాలీవుడ్ మీడియాతో త‌న మ‌న‌సులో మాట‌లు (భావాలు) పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని సినిమా ప్ర‌మోష‌న్స్ లో ఎక్కువుగా పాల్గొరు ఎందుకు అని ప్ర‌శ్నిస్తే....సినిమా ప్ర‌మోష‌న్ ఎక్కువుగా చేయ‌డం అంటే నాకు చాలా క‌ష్టంగా ఉంటుంది. ఎందుకంటే నా టైమ్ వేస్ట్ అయిపోతుంది అని నా ఫీలింగ్. నా జాబ్ నేను చేసాను. సినిమా న‌చ్చితే చూస్తారు. లేక‌పోతే రిజిక్ట్ చేస్తారు. దీనినే నేను న‌మ్ముతాను అంటూ స‌మాధానం ఇచ్చారు.
రాజ‌కీయాలు గురించి ప్ర‌శ్నిస్తే....చిన్న‌ప్ప‌టి నుంచి ధ‌న‌వంతుడు, పేద‌వాడు..అనే తేడా ఎందుకు..? కులాల మ‌ధ్య ఈ అంత‌రం ఏమిటి..? అని ఆలోచించే వాడిని. నా వ‌య‌సు పెరుగుతున్నా కొద్ది వీటి గురించి ఆలోచ‌న‌లు కూడా నాలో పెరిగాయి.చిన్న‌ప్ప‌టి నుంచి రాజ‌కీయాల పై ఉన్న ఆ ఇంట్ర‌స్టే న‌న్ను ఇలా రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించేలా చేసింది అన్నారు. అన్న‌య్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నేను టి.డి.పి. కి స‌పోర్ట్ చేస్తున్నాను. అయితే... నేను ఏం చేస్తున్నానో మా బ్ర‌ద‌ర్ తో క‌మ్యూనికేట్ చేస్తుంటాను. నేను ఎందుకు టి.డి.పి కి స‌పోర్ట్ చేస్తున్నాను అనే దానికి నా కార‌ణాలు నాకు ఉన్నాయి. అన్న‌య్యకి చెప్పిన‌ప్పుడు నాతో ఏకీభ‌వించారు. న‌న్ను, నా ఆలోచ‌న‌ల‌ను అర్ధం చేసుకున్నారు. భ‌విష్య‌త్ లో మేం ఏం చేస్తామ‌నేది మాత్రం నాకు తెలియ‌దు అని న‌వ్వుతూ చెప్పారు.
ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్పుడు మీలో అసంతృప్తి ఏర్పడింది క‌దా..అంటే నిజ‌మే..నాలో అసంతృప్తి ఏర్ప‌డింది. ఎందుకంటే ఎంతో మంది త్యాగాల ఫ‌లితం మ‌న‌దేశ స్వాతంత్ర్యం. గ‌తంలో జ‌రిగిన దానికి ఫ‌లిత‌మే ఈ విభ‌జ‌న. అందుచేత మ‌ళ్లీ ఎలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు విభ‌జ‌న వ‌ల‌న ఎవ‌రైతే బాధ‌ప‌డుతున్నారో వాళ్ల‌కి ఎందుకు విభ‌జ‌న చేయాల్సి వ‌చ్చింది అనేది ఖ‌చ్చితంగా వివ‌రించి చెప్పాలి. అది జ‌ర‌గ‌లేదు. అందుచేత విభ‌జ‌న జ‌రిగిన విధానం అసంతృప్తి క‌లిగించింద‌న్నారు.
మీరు రెండు మూడు సినిమాల త‌ర్వాత న‌ట‌నకు గుబ్ బై చెప్పేస్తాను అన్నారు. కానీ...మీ అన్న‌య్య చిరంజీవి స‌ర్ధార్ ఆడియో ఫంక్ష‌న్ లో జ‌నాన్ని ఎంట‌ర్ టైన్ చేయ‌డం ఆప‌ద్దు అని చెప్పారు. మీరేమంటారు..? అంటే స‌ర్ధార్ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాను. మూడు నాలుగు నెల‌లు స‌రిగా ప‌డుకోలేదు. సినిమా అంటే ఇలా క‌ష్ట‌ప‌డాలి. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ప్రజ‌ల‌తో ఎక్కువుగా ఇన్ వాల్వ్ అవ్వాలి. సినిమాలు, రాజ‌కీయాలు ఈ రెండింటికి న్యాయం చేయాలంటే క‌ష్టం. అందుచేత సినిమాల‌కు గుడ్ బై చెబుతాను అన్నాను. సినిమాలంటే ఇష్టం. అది ఎప్ప‌టికీ పోదు. అలాగే నాకు ఎక్కువుగా క‌థ‌లు రాయ‌డం బాగా ఇష్టం. అందుచేత రాజ‌కీయాల్లోకి వెళ్లినా క‌థ‌లు రాస్తుంటాను అన్నారు.
మీ ఫ్యాన్స్ రాజ‌మౌళితో సినిమా చేస్తే బాగుంటుంద‌ని కోరుకుంటున్నారు అంటే..రాజ‌మౌళిని రెండు మూడు సార్లు క‌లిసాను. ఫ‌స్ట్ టైం ఓ ఆడియో ఫంక్ష‌న్ లో క‌లిసాను. నేను ఏ సినిమా కావాల‌ని ప్లాన్ చేయ‌ను. అలా జ‌ర‌గాలి అంతే అన్నారు బాహుబ‌లి సినిమా చూసారా అంటే..?బాహుబ‌లి సినిమా చూడ‌లేద‌ని చెప్పారు. త‌ను న‌టించిన నాలుగైదు సినిమాలే చూడ‌లేద‌న్నారు.
బాలీవుడ్ సినిమాలు చూస్తుంటారా..? అని అడిగితే.. బాలీవుడ్ సినిమాను ఫాలో అవుతాను. ఈమ‌ధ్య‌ చెన్నై ఎక్స్ ప్రెస్ చూసాను.అలాగే జ‌బ్ వి మెట్ చేసాన‌ని చెప్పారు. బాలీవుడ్ స్టార్స్ తో మీకున్న ప‌రిచ‌యాలు గురించి అంటే..అభిషేక్ బ‌చ్చ‌న్ ని క‌లిసాను. మిగిలిన బాలీవుడ్ స్టార్స్ తో క‌లిసే అవ‌కాశం రాలేద‌న్నారు.
సున్నిత‌మైన అంశాలు గురించి మాట్లాడ‌డానికి స్టార్స్ అంత‌గా ఆస‌క్తి చూపారు. కానీ..ప‌వ‌న్ సున్నిత‌మైన అంశాల పై త‌న అభిప్రాయాల‌ను చెప్పారు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఆమ‌ధ్య త‌న భార్య‌తో జ‌రిగిన సంభాష‌ణ బ‌య‌ట‌పెట్టి దేశంలో అస‌హ‌నం పెరిగిపోతుంది. దేశం విడిచి వెళ్లిపోవాల‌ని అనిపిస్తుంది అన్నారు. ఇది పెద్ద సంచ‌ల‌న అయిన విష‌యం తెలిసిందే. ఈ సంఘ‌ట‌న పై ప‌వ‌న్ స్పందిస్తూ...ఇంట్లో జ‌రిగిన విష‌యాల్ని జ‌న‌ర‌లైజ్ చేసి మాట్లాడ‌డం క‌రెక్ట్ కాద‌న్నారు. అలాగే ఒక మాట చెప్పిన త‌ర్వాత ఆ మాట‌కి క‌ట్టుబ‌డి ఉండాలి అంతే కానీ..మాట మార్చ‌కూడ‌దు..పారిపోకూడ‌ద‌న్నారు. అలాగే రోహిత్ వేముల ఆత్య‌హ‌త్య గురించి స్పందిస్తూ...రోహిత్ ఆత్య‌హ‌త్య బాధాక‌రం. అయితే రాజ‌కీయ పార్టీలు ఈ సంఘ‌ట‌న‌ను హైలెట్ చేయ‌డం స‌రికాద‌న్నారు. సున్నిత‌మైన అంశాల గురించి స్పందించ‌డానికి సెల‌బ్రిటీస్ అందులోను సినీస్టార్స్..అస‌లు ముందుకు రారు. మ‌రి ప‌వ‌న్ ఎవ‌రు ఏమీ అనుకుంటారో అనే ఆలోచ‌న లేకుండా త‌న మ‌న‌సులో మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్ట‌డం విశేషం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.