close
Choose your channels

ప‌వ‌ర్ స్టార్ కాట‌మ‌రాయుడు రిలీజ్ డేట్..!

Monday, October 24, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం కాట‌మ‌రాయుడు. ఈ చిత్రాన్ని గోపాల గోపాల ఫేమ్ డాలీ తెర‌కెక్కిస్తున్నారు. ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప‌వ‌న్ స‌రికొత్త గెట‌ప్ లో క‌నిపించ‌నున్నారు. గ‌బ్బ‌ర్ సింగ్ లో ప‌వ‌న్ తో క‌లిసి న‌టించిన శృతిహాస‌న్ ఈ చిత్రంలో కూడా న‌టిస్తుండ‌డం విశేషం.

ప్ర‌స్తుతం ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రం ఇప్ప‌టికే మూడు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ను హైద‌రాబాద్ లో చిత్రీక‌రిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే...ఈ భారీ చిత్రాన్ని ఉగాది కానుక‌గా మార్చి 29న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.