close
Choose your channels

త్రివిక్రమ్ సినిమాలో పవన్ రోల్ ఎంటంటే...

Tuesday, March 14, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మూవీ అంటేనే ఓ క్రేజ్ నెల‌కొంటుంది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలుగా నిలిచాయి. ఇప్పుడు వీరిద్ద‌రూ హ్యాట్రిక్ కాంబోగా సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాట‌మ‌రాయుడు చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. కాట‌మ‌రాయుడు మార్చి24న విడుద‌ల‌వుతుంది. ఏప్రిల్ నుండి ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో సినిమా ప్రారంభ‌మవుతుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. జ‌ల్సా సినిమాలో మాజీ న‌క్స‌లైట్‌గా, అత్తారింటికి దారేది చిత్రంలో బిలియ‌నీర్‌గా ప‌వ‌న్‌ను ప్రెజెంట్ చేసిన త్రివిక్ర‌మ్ ఇప్పుడు ఐటి అనలిస్ట్‌గా చూపించ‌బోతున్నాడ‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.