close
Choose your channels

'పోలీసోడు' సెన్సార్ పూర్తి....

Sunday, April 3, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విజయ్, సమంత, ఎమీజాక్సన్ హీరో హీరోయిన్లుగా రాజా రాణి ఫేమ్ అట్లీ దర్శకత్వంలో రుపొందిన చిత్రం తెరి`. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు పోలీసోడు` అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఏప్రిల్ 14న విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

అలాగే ఏప్రిల్ 6న ఆడియో విడుదల కానుంది. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. తమిళంలో స్టార్ గా ఉన్న విజయ్ గత కొన్ని చిత్రాల నుండి తెలుగులో కూడా మార్కెట్ ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ చిత్రం తెలుగులో విజయ్ కు ఎలాంటి క్రేజ్ ను తీసుకొస్తుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.