close
Choose your channels

పోలీసోడు ర‌న్ టైమ్..

Thursday, April 14, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త‌మిళ హీరో విజ‌య్ న‌టించిన తెరి చిత్రం తెలుగులో పోలీసోడు టైటిల్ తో రిలీజ్ అవుతుంది. విజ‌య్ స‌ర‌స‌న స‌మంత‌, అమీ జాక్స‌న్ న‌టించారు. అట్లీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ సినిమాలో హీరోయిన్ మీనా కూతురు నైనిక బాల న‌టిగా న‌టించ‌డం విశేషం. ఈ చిత్రాన్ని తెలుగులో రేపు రిలీజ్ చేస్తున్నారు.

యాక్ష‌న్, ఫ్యామిలీ డ్రామా, స‌స్పెన్స్...ఇలా ప్రేక్ష‌కులు కోరుకునే అన్ని అంశాలు ఉన్న ఈ చిత్రం పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. దీనికి తోడు ఈ చిత్రాన్ని దిల్ రాజు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తుండ‌డంతో పోలీసోడు సినిమా పై మ‌రింత క్రేజ్ పెరిగింది. ఇక ఈ సినిమా ర‌న్ టైమ్ విష‌యానికి వ‌స్తే...158 నిమిషాలు అంటే 2 గంట‌ల 38 నిమిషాలు. మ‌రి...అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు పోలీసోడు మంచి విజ‌యాన్ని సాధిస్తుందేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.