close
Choose your channels

బోయపాటితో గొడవ ఏమిటో బయటపెట్టి ఫైర్ అయిన పోసాని..!

Monday, October 17, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు, న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి గ‌తంలో ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో ఓ డైరెక్ట‌ర్ త‌న‌కు ఇబ్బంది క‌లిగించాడు అంటూ పేరు చెప్ప‌కుండా విమ‌ర్శ‌లు చేసాడు. ఇప్పుడు మ‌రో న్యూస్ ఛాన‌ల్ కి ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో డైరెక్ట‌ర్ బోయ‌పాటి పై ఫైర్ అయ్యారు. మీ ద‌గ్గ‌ర ప‌ని చేసిన వాళ్లు చాలా మంది మంచి పొజిష‌న్ లో ఉన్నారు క‌దా..వాళ్ల‌ను చూస్తే మీకు ఏమ‌నిపిస్తుంటుంది అని అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా పోసాని మాట్లాడుతూ....నా ద‌గ్గ‌ర ప‌నిచేసిన వాళ్ల‌లో త్రివిక్ర‌మ్, కొర‌టాల శివ‌...ఇలా ఓ 30 మంది పైగా మంచి పొజిష‌న్ లో ఉన్నారు. వాళ్ళంతా నాకు ఎంతో గౌర‌వం ఇచ్చి మాట్లాడుతుంటారు.
కానీ...నా అనుకున్న బోయ‌పాటి శ్రీను మాత్రం చాలా చీప్ గా బిహేవ్ చేసాడు. నేను శ్రావ‌ణ‌మాసం సినిమా తీసాను. ఈ సినిమా ఫ్లాప్ అయితే...నేను లేన‌ప్పుడు మా ఇంటికి వ‌చ్చి వ‌దినా...మేమంటే డైరెక్ష‌న్ డిపార్టెమెంట్ లో వ‌ర్క్ చేసాం. అన్న‌య్య డైరెక్ష‌న్ డిపార్టెమెంట్ లో వ‌ర్క్ చేయ‌లేదు క‌దా..! అందుకే సినిమా పోయింది. ఇప్పుడు ఇంటికి సంబంధించిన బిల్లులు క‌ట్టుకోవ‌డానికి క‌ష్ట‌ప‌డాలేమో క‌దా వ‌దినా అంటూ చాలా చీప్ గా మాట్లాడాడు. బోయ‌పాటి చాలా పేద కుటుంబం నుంచి వ‌చ్చారు. వాళ్ల నాన్న వాచ్ మెన్ గా చేసేవాడు. బోయ‌పాటి బ్ర‌ద‌ర్ బోయ‌పాటి బ్ర‌హ్మ‌య్య ఫోటో స్టూడియో పెట్టి పాస్ పోర్ట్ ఫోటోలు తీస్తుండేవాడు. ఆ వ‌చ్చే డ‌బ్బులుతో ఫ్యామిలీ అంతా బ‌తికేది. ఓరోజు బ్ర‌హ్మ‌య్య వ‌చ్చి బోయ‌పాటి శ్రీనుని ఇండ‌స్ట్రీలో ఎక్క‌డైనా పెట్ట‌మ‌న్నాడు. అప్పుడు డైరెక్ట‌ర్ ముత్యాల సుబ్బ‌య్య ద‌గ్గ‌ర బోయ‌పాటి శ్రీనుని పెట్టాను. అలాంటిది అలా ఎలా ప్ర‌వ‌ర్తించాడో అర్ధం కాలేదు. అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌ను మాత్ర‌మే త‌ప్పు బ‌ట్టాను. నాకు ఎవ‌రి పై వ్య‌క్తిగ‌తంగా కక్ష‌లు లేవు అంటూ బోయ‌పాటితో గొడ‌వ‌ను బ‌య‌ట‌పెట్టారు పోసాని..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.