close
Choose your channels

ఆ హీరోయిన్ కి ప్రకాష్ రాజ్ ఆఫర్...

Tuesday, December 22, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆకాశ‌మంత‌, థోని, ఉల‌వ‌చారు బిర్యాని, గౌర‌వం...ఇలా విభిన్న చిత్రాల‌ను అందించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న‌ విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్. ఆయ‌న తాజాగా అందిస్తున్న చిత్రం మ‌న ఊరి రామాయ‌ణం. విభిన్న క‌థాంశంతో రూపొందించే ఈ చిత్రాన్ని ప్ర‌కాష్ రాజ్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు. ఈనెలాఖ‌రు నుంచి సెట్స్ కి వెళ్ల‌నుంది. ఓ కొత్త కాన్సెప్ట్ తో రూపొందించే ఈ చిత్రాన్ని కోటి రూపాయ‌ల్లో నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టించే ఆఫ‌ర్ ను ప్రకాష్ రాజ్ ప్రియ‌మ‌ణి కి ఇచ్చారు. తెలుగు, త‌మిళ్ లో రూపొందే ఈ చిత్రానికి ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. మ‌రి..ప్ర‌కాష్ రాజ్ మ‌న ఊరి రామాయ‌ణం సినిమా తోనైనా ప్రియ‌మ‌ణి మ‌ళ్లీ బిజీ అవుతుందేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.