close
Choose your channels

పూరి పై దాడి చేసాం అనేది అవాస్త‌వం - లోఫ‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్స్

Monday, April 18, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లోఫ‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్స్ అభిషేక్, ముత్యాల రాందాసు, సుధీర్...త‌న పై దాడి చేసార‌ని డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం...పోలీసులు డిస్ట్రిబ్యూట‌ర్స్ పై కేసు న‌మోదు చేయ‌డం తెలిసిందే. ఈ సంఘ‌ట‌న గురించి డిస్ట్రిబ్యూట‌ర్స్ ఫిలిం ఛాంబ‌ర్ లో మీడియా మీట్ ఏర్పాటు చేసారు.

ఈ మీడియా మీట్ లో డిస్ట్రిబ్యూట‌ర్ అభిషేక్ మాట్లాడుతూ...2014లో రిలీజైన హార్ట్ ఎటాక్ సినిమాకి సంబంధించిన టాక్స్ స‌ర్టిఫికెట్ విష‌య‌మై పూరితో మాట్లాడాం. అంతే కానీ..ఎలాంటి బ్లాక్ మెయిల్ చేయ‌లేదు. మాపై అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తూ..త‌ప్పుడు కేసులు పెట్టారు. పూరి ఆఫీస్ లో ఉన్న సెక్యూరిటీ ని దాటుకుని ముందుకు వెళ్లే ప‌రిస్థితి లేదు. నిజంగానే మేము దాడి చేసి ఉంటే...పూరి జ‌గ‌న్నాథ్ ఆఫీస్ లో సిసి కెమెరాలు ఉన్నాయి క‌దా...ఒక్క ఆధార‌మైన చూపించండి.మేము త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిస్తే ఎలాంటి శిక్ష వేసినా అనుభ‌విస్తాం. మేము దాడి చేసాం అనేది వాస్త‌వం కాద‌ని తేలిన త‌ర్వాత‌..పూరి పై మేము కేసు పెట్ట‌డానికి కూడా రెడీగా ఉన్నాం అన్నారు.

డిస్ట్రిబ్యూట‌ర్ ముత్యాల రాందాసు మాట్లాడుతూ...పూరి జ‌గ‌న్నాథ్ - నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం.అలాంటిది మాపై ఎందుకు కేసులు పెట్టాడో అర్ధం కావ‌డం లేదు. లోఫ‌ర్ సినిమాని నైజాంలో అభిషేక్ పిక్చ‌ర్స్ పంపిణీ చేస్తే..నేను తూర్పు గోదావ‌రి జిల్లాలో పంపిణి చేసాను. నైజాం లో లోఫ‌ర్ సినిమాకి రెండున్న‌ర కోట్లు న‌ష్టం వ‌చ్చింది. ఈ విష‌యాన్ని మూడు నెల‌ల క్రితం పూరికి తెలియ‌చేసాం. నిర్మాత సి.క‌ళ్యాణ్ గార్నిఅడ‌గండి అన్నారు. ఆత‌ర్వాత పూరి పై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. కానీ..మేము దాడి చేసాం అంటూ ఫిర్యాదు చేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్..?మాపై ఆరు సెక్ష‌న్ ల కింద కేసు పెట్టారు. ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిద‌నుకుంటే డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్, ఫిలిం ఛాంబ‌ర్ లో ప‌రిష్క‌రించుకోవాలి. కానీ...ఇలా కేసులు పెట్ట‌డం క‌రెక్ట్ కాదు. పోలీసులు ఎలాంటి ఆధారాలు చూడ‌కుండా కేసులు పెట్ట‌డం బాధాక‌రం. గ‌తంలో జానీ సినిమా ఫ్లాప్ అయిన‌ప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్, బాబా ప్లాప్ అయితే ర‌జ‌నీకాంత్, ఆగ‌డు సినిమా ఫ్లాప్ అయిన‌ప్పుడు మ‌హేష్ బాబు, సికింద‌ర్ ఫ్లాప్ అయితే సూర్య డిస్ట్రిబ్యూట‌ర్స్ కి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించి ఆదుకున్నారు. అలాగే డైరెక్ట‌ర్స్ వినాయ‌క్, శ్రీను వైట్ల కూడా డిస్ట్రిబ్యూట‌ర్స్ కి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించారు. లోఫ‌ర్ సినిమా విష‌యంలో పూరి జ‌గ‌న్నాథ్ కూడా ఈ విష‌యం పై ఆలోచించి స్పందిస్తే బాగుంటుంది అనుకున్నాం కానీ...ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు అన్నారు.

సుధాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ...ఏ సినిమా అయినా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూట‌ర్ ఇర‌వై శాతం మాత్ర‌మే రిస్క్ తీసుకుంటాడు. యాభైశాతం న‌ష్టం వ‌స్తే..నిర్మాత కానీ, ద‌ర్శ‌కుడు కానీ, హీరో కానీ న‌ష్ట ప‌రిహారం చెల్లించాలి. నిర్మాత న‌ష్టాల్లో ఉంటే డిస్ట్రిబ్యూట‌ర్ ద‌ర్శ‌కుడు ద‌గ్గ‌ర‌కే వెళ‌తారు. అయితే మా డిస్ట్రిబ్యూట‌ర్స్ పూరి ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌లేదు. పోలీసులు ఈ విష‌యం పై విచార‌ణ జ‌రిపి మా డిస్ట్రిబ్యూట‌ర్స్ త‌ప్పు ఉంటే శిక్షించండి. మా వాళ్ల త‌ప్పులేక‌పోతే పూరి పై యాక్ష‌న్ తీసుకోవాలి. ఆధారాలు లేకుండా పోలీసులు ఎలా కేసులు పెడ‌తారు అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.