close
Choose your channels

పూరిఇజం ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

Saturday, September 3, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం ఇజం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ ప‌వ‌ర్ ఫుల్ జ‌ర్న‌లిస్ట్ గా న‌టిస్తున్నారు. క‌ళ్యాణ్ రామ్ చెప్పే ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ ప్ర‌తి ఒక్క‌రిని ఆలోచింప చేసేలా, ముఖ్యంగా జ‌ర్న‌లిస్ట్ ల మ‌న‌సుల‌ను క‌దిలించేలా ఉంటాయ‌ని స‌మాచారం.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఇజం ఈరోజు నుంచి డ‌బ్బింగ్ స్టార్ట్ చేసారు. వినాయ‌క చ‌విత సంద‌ర్భంగా ఈనెల 5న ఇజం టీజ‌ర్ ను రిలీజ్ చేయ‌నున్నారు. అనూప్ సంగీతం అందించిన ఆడియోను కూడా ఈ నెల‌లో రిలీజ్ చేస్తారు. ఇక సినిమా రిలీజ్ విష‌యానికి వ‌స్తే....ఈ నెల 29న రిలీజ్ చేయాల‌నుకున్నారు కానీ....ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 7న ఇజం రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అని స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.