close
Choose your channels

పూరి సిసలైన పైత్యం 'రోగ్'

Tuesday, March 7, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ పెన్ను పైత్యం ఎలా ఉంటుందో అంద‌రికీ తెలుసు. ఆయ‌న క‌థ‌లో ద‌మ్ము.. ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ లు యూత్ ని పిచ్చెక్కిస్తాయి. హీరోలు...ఆవారాల్లా హీరోయిన్ల వెంట ప‌డ‌టం..కాదంటే ప్రేమించే వ‌ర‌కూ వేదించ‌డం..చివ‌రికి సిస‌లైన హీరోగా ఆ అమ్మాయి ని ద‌క్కించుకోవ‌డం అన్నీ` పోకిరి`.. `బిజినెస్ మెన్` ...`లోఫ‌ర్` సినిమాల్లో చూసేశాం. కానీ ఇవ‌న్నీ పూరి స్టార్ డైరెక్ట‌ర్ గా ఎస్టాబ్లిష్ అయిన త‌ర్వాత‌..
ఆయ‌న పూర్తిగా ద‌ర్శ‌కుడిగా ప‌రిణితి చెందిన త‌ర్వాత చేసిన సినిమాలు.
వీట‌న్నింటికంటే ముందు `ఇడియ‌ట్` గా ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. ఇప్పుడు ఈ క‌థ‌కు కొన‌సాగింపుగా `రోగ్` అనే చిత్రాన్ని ఇషాన్ హీరోగా ప‌రిచయం చేస్తూ తెర‌కెక్కిస్తున్నాడు. ఇటీవ‌లే ట్రైల‌ర్ కూడా రిలీజ్ చేశాడు. అయితే పూరి లో అస‌లైన పైత్యం ఈ సినిమా క‌థ‌లో క‌నిపిస్తుంద‌ని ఆయ‌న అత్యంత స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. పూరి కాలేజ్ డేస్ లో ఎంజాయ్ చేసిన అంశాల‌నే హైలైట్ చేస్తూ నేటి యువ‌త‌ను ట‌చ్ చేసేలా తెర‌కెక్కించ‌డాని అంటున్నారు. పూరి అసలు సిస‌లైన పైత్యం ఈ సినిమాలో క‌నిపిస్తుంద‌ని జోరుగా స్ర్పెడ్ అవుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.