close
Choose your channels

ఆ స్పూర్తితోనే నందిని న‌ర్సింగ్ హోమ్ క‌థ రాసాను..అంత మంది రైట‌ర్స్ అలా చెప్ప‌డంతో నాలో న‌మ్మ‌కం పెరిగింది - డైరెక్ట‌ర్ పి.వి.గిరి

Monday, October 24, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు విజ‌య‌నిర్మ‌ల మ‌న‌వ‌డు న‌వీన్ వికె హీరోగా పి.వి గిరి తెర‌కెక్కించిన చిత్రం నందిని న‌ర్సింగ్ హోమ్. ఈ టైటిల్ కి ఇక్క‌డ అంతా క్షేమ‌ము అనేది ట్యాగ్ లైన్. న‌వీన్, నిత్యా, శ్రావ్య హీరో, హీరోయిన్స్ గా న‌టించిన నందిని న‌ర్సింగ్ హోమ్ చిత్రాన్ని ఎస్.వి.పి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై రాధా కిషోర్ జి, భిక్ష‌మ‌య్య సంగం సంయుక్తంగా నిర్మించారు. ఇటీవ‌ల రిలీజైన నందిని న‌ర్సింగ్ హోమ్ చిత్రం ఫ‌స్డ్ డే నుంచి పాజిటివ్ టాక్ తో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది.

ఈ సంద‌ర్భంగా నందిని న‌ర్సింగ్ హోమ్ డైరెక్ట‌ర్ పి.వి.గిరి మాట్లాడుతూ...నేను రాజ‌మండ్రిలో పుట్టి పెరిగాను. చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాల పై ఇంట్ర‌స్ట్ తో ఇ.వి.వి స‌త్యనారాయ‌ణ గారు, జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి ద‌గ్గ‌ర రైట‌ర్ గా వ‌ర్క్ చేసాను. ఆత‌ర్వాత బెండు అప్పారావు, దిక్కులు చూడ‌కు రామ‌య్య చిత్రాల‌కు క‌థ అందించాను. నందిని న‌ర్సింగ్ హోమ్ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాను. ద‌ర్శ‌కుడిగా నా తొలి చిత్రం నందిని న‌ర్సింగ్ హోమ్ చిత్రానికి మంచి స్పంద‌న ల‌భిస్తుండ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా నిర్మాత‌ రాధా కిషోర్ మా క‌జిన్. రాధా కిషోర్, భిక్ష‌మ‌య్య ఈ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. ఈ సినిమా క‌థ‌ను ఓ 30 మంది రైట‌ర్స్ కి చెప్పాను. వాళ్లు క‌థ విని క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఊహించ‌లేక‌పోయారు. దీంతో ఖ‌చ్చితంగా సినిమా స‌క్సెస్ సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం ఏర్ప‌డింది.

ఇక న‌రేష్ గారు, న‌వీన్ కి ఈ క‌థ చెప్ప‌గానే ఎలాంటి ఆలోచ‌న లేకుండా సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేయ‌డం చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. ల‌క్ష్మిక‌ళ థియేట‌ర్ లో ఈ సినిమా చూస్తున్న‌ప్పుడు ఓ ఆడియోన్ నా ద‌గ్గ‌రకు వ‌చ్చి సినిమా చాలా బాగుంది అని నాకు సెల్యూట్ చేసాడు. అలాగే మ‌రో ప్రేక్ష‌కుడు రెండు సార్లు క‌ళ్లంట నీళ్లు వ‌చ్చాయి అని చెప్పాడు. ఈ రెండింటిని మ‌ర‌చిపోలేను. ఈ సినిమా క‌థ‌కు స్పూర్తి ఏమిటంటే...వైజాగ్ లో బ్రెయిన్ డెడ్ అయి ఓ వ్య‌క్తి చ‌నిపోవ‌డంతో అవ‌య‌వాలు దానం చేసారు. ఆత‌ర్వాత చ‌నిపోయిన వ్య‌క్తి బంధువులు వ‌చ్చి బ్రెయిన్ డెడ్ తో చ‌నిపోలేదు అని గొడ‌వ చేసారు. ఈ సంఘ‌ట‌న టీవీలో ప్రసారం చేసారు అది చూసి ఇన్ స్పైయిర్ అయి ఈ క‌థ రెడీ చేసాను. ఈ సినిమా హైలెట్ అంటే న‌వీన్ న‌ట‌న‌. పాత్ర‌కు త‌గ్గ‌ట్టు చాలా బాగా న‌టించాడు. ఈ చిత్రాన్ని క‌న్న‌డ‌లో రీమేక్ చేయాల‌నుకుంటున్నాం. ఈ చిత్ర నిర్మాణ సంస్థ క‌న్న‌డ‌లో రీమేక్ చేయ‌నుంది. అయితే...ఈ రీమేక్ ని నేనే డైరెక్ట్ చేస్తానా..? వేరే డైరెక్ట‌ర్ చేస్తారా అనేది త్వ‌ర‌లో తెలుస్తుంది. నా త‌దుప‌రి చిత్రాన్ని ఈ బ్యాన‌ర్ లోనే చేయ‌నున్నాను అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.