close
Choose your channels

ఏప్రిల్ లో 14న లారెన్స్ 'శివ లింగ'

Friday, March 17, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కొరియోగ్రాప‌ర్‌గా, ద‌ర్శ‌క‌హీరోగా త‌న‌దైన ఐడెంటిటీతో దూసుకుపోతున్న రాఘ‌వ లారెన్స్ న‌టించిన తాజా చిత్రం శివ‌లింగ` ఏప్రిల్‌లో రిలీజ‌వుతోంది. చంద్ర‌ముఖి` వంటి సంచ‌ల‌న చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ పి.వాసు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్ న‌టించిన శివ‌లింగ` చిత్రాన్ని అదే టైటిల్‌తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై నిర్మించారు.ఏప్రిల్ 14న అభిషేక్ ఫిలింస్ వారు ఈ సినిమాను విడుదల చెస్తున్నారు..
ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.., ``క‌థే హీరోగా కన్నడలో బ్లాక్‌బస్టర్ అయిన చిత్రమిది. పి.వాసు గారి చంద్రముఖి` ఎంత‌టి సెన్సేష‌నో తెలిసిందే. అలాగే లారెన్స్ కాంచన`, గంగ` ఏ స్థాయిలో విజ‌యాలు సాధించాయో తెలుసు. వాటిని మించిన కథ, కథనాలతో హారర్ ఎంటర్ టైనర్‌గా శివలింగ` తెరకెక్కింది. ప్ర‌స్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ట్రైల‌ర్‌, పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.ఏప్రిల్‌లో 14న అభిషేక్ ఫిలింస్ వారు సినిమాని రిలీజ్ చేస్తున్నారు. హారర్‌ కాన్సెప్ట్ ల పరంగా శివలింగ` నెక్ట్స్ లెవెల్‌లో ఉండే చిత్రమ‌వుతుంది`` అని తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.