కన్నతల్లి గుడిని ప్రారంభించిన లారెన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడైన రాఘవ లారెన్స్కు తల్లి అంటే ఎంతో ఇష్టం. తల్లిదండ్రులే దైవాలని చెప్పే లారెన్స్ కన్నతల్లి కోసం ఏకంగా గుడినే కట్టేశాడు. చెన్నై అంబత్తూరు సమీపంలో తిరుములైవాయల్లో తల్లి కణ్మనికి లారెన్స్ గుడి కట్టించారు. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ గుడిని లారెన్స్ ప్రారంభించారు. తర్వాత గాయత్రీ దేవి విగ్రహం, శివలింగ ఆవిష్కరణ కూడా జరిగింది.
కణ్మణి విగ్రహాన్ని జైపూర్ నుండి తెప్పించిన ప్రత్యేకమైన పాలరాతితో నిర్మించారు లారెన్స్. ప్రారంభోత్సవం అనంతం వెయ్యి మంది మహిళలకు చీరల పంపిణీ చేశారు. పంట రుణాల కోసం బంగారు నగలు తాకట్టు పెట్టిన ఆరుగురు రైతులకు సహాయం చేసి ఆ నగలను విడిపించారు. ఈ ఆలయాన్ని స్టంట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్ ఆవిష్కరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.