close
Choose your channels

తెలుగులో విడుదల కానున్న రెహమాన 'ఒరు ముగత్తిరై'

Wednesday, March 22, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తమిళ నటుడు రెహమాన తెలుగువారికి బాగా సుపరిచితుడే. ఆయన నటించిన 16 - ఎవ్రీ డీటైల్‌ కౌంట్స్‌` ఇటీవల తెలుగులో విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది. అటు విమర్శకుల ప్రశంసల్ని, ఇటు బాక్సాఫీసు వసూళ్లను కూడా రాబట్టుకుంది. రెండో వారంలోనూ చక్కటి థియేటర్లలో, మంచి వసూళ్లతో ప్రదర్శితమవుతోంది. 16-ఎవ్రీ డీటైల్‌ కౌంట్స్‌` చిత్రానికి గానూ మిగిలిన అందరితోనూ పోలిస్తే రెహమానకు మరింత మంచి పేరు వచ్చింది. తాజాగా ఆయన నటించిన ఒరు ముగత్తిరై` తెలుగులోకి అనువాదం కానుంది.
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రాన్ని వేసవికి విడుదల చేయనున్నారు. డి.వెంకటేశ ఈ చిత్రం హక్కులను తీసుకున్నారు. డీవీ సినీ క్రియేషన్స పతాకంపై ఈ సినిమాను ఆయన తెలుగులో విడుదల చేస్తున్నారు. జీవా, కాజల్‌ నటించిన ఎంతవరకు ఈ ప్రేమ` చిత్ర నిర్మాత ఇతనే. ఒరు ముగత్తిరై`కు సెంథిల్‌నాథన దర్శకత్వం వహించారు. ఇది థ్రిల్లర్‌ చిత్రం. ఓ సైకియాట్రిక్‌ డాక్టర్‌కి సంబంధించిన కథ ఇది. సైకాలజీ విద్యార్థిని ఇష్టపడి మానసికంగా ఇబ్బందులకు గురైన సైకియాట్రిక్‌ డాక్టర్‌కు సంబంధించిన కథతో తెరకెక్కింది. అదితి, దేవికా మాధవన, ఢిల్లీ గణేశ, మీరా కృష్ణన ఇందులో కీలక పాత్రధారులు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.