close
Choose your channels

ఈనెల 3న ధనుష్ , కీర్తి సురేష్ ల రైల్ ఆడియో

Thursday, September 1, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రఘువరన్‌ బి.టెక్‌, అనేకుడు, మాస్‌, మరియన్‌...ఇలా విభిన్న క‌థా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన త‌మిళ‌ హీరో ధనుష్‌, నేను శైలజ ఫేమ్ కీర్తి సురేష్ జంట‌గా రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ రైల్‌. ఆదిత్య మూవీ కార్పొరేషన్‌, శ్రీ పరమేశ్వరి రగ్న పిక్చర్స్ బ్యాన‌ర్స్ పై బేబి రోహిత రజ్న సమర్పణలో ఈ చిత్రం రూపొందుతుంది. ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి నిర్మిస్తున్న రైల్ చిత్రం ఈనెల‌ 16న విడుదల కాబోతోంది. ఈ చిత్రం ఆడియోను ఈనెల 3న గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ... హీరో ధనుష్‌కి తెలుగు ప్రేక్షకుల్లో ఎంతటి ఫాలోయింగ్‌ వుందో అందరికీ తెలిసిందే. ఆయన నటించిన రఘువరన్‌ బి.టెక్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయి కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ అయ్యింది. అలాగే నేను శైల‌జ సినిమాతో కీర్తి సురేష్ కి తెలుగులో మంచి గుర్తింపు వ‌చ్చింది. ఇప్పుడు ధ‌నుష్ - కీర్తి సురేష్ కల‌యిక‌లో రూపొందిన రైల్ మూవీ పై మంచి క్రేజ్ ఉంది. త‌ప్ప‌కుండా యూత్ కి రైల్ మూవీ న‌చ్చుతుంది అనేది మా న‌మ్మ‌కం. ఈనెల 3న ఆడియో రిలీజ్ చేసి చిత్రాన్ని 16న రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు.
ధనుష్‌, కీర్తి సురేష్‌, తంబి రామయ్య, కరుణాకరన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్‌, సినిమాటోగ్రఫీ: వెట్రివేల్‌ మహేంద్రన్‌, ఎడిటింగ్‌: ఎల్‌.వి.కె.దాస్‌, ఫైట్స్‌: స్టన్‌ శివ, మాటలు: వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, సాహితి, నిర్మాణ సారధ్యం: వడ్డి రామానుజం, సమర్పణ బేబి రోహిత రజ్న, నిర్మాతలు: ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి, దర్శకత్వం: ప్రభు సాల్మన్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.