close
Choose your channels

రాజ్ తరుణ్, వెలిగొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో 'అంధగాడు' ప్రారంభం

Wednesday, October 26, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కుమారి 21 ఎఫ్‌, ఈడోరకం-ఆడోర‌కం వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జంట‌గా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.10 `అంధ‌గాడు` లాంచ‌నంగా ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్‌లోని చిత్ర నిర్మాణ సంస్థ కార్యాల‌యంలో సినిమా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ముఖ్య అతిథిగా విచ్చేసి పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడు వెలిగొండ శ్రీనివాస్‌కు అంద‌జేశారు. ఈరోజు నుండి సినిమా రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రం ద్వారా స‌క్సెస్‌ఫుల్ రైట‌ర్ వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. న‌ట‌కిరిటీ డా.రాజేంద్ర‌ప్రసాద్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ - ``ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రాజ్‌త‌రుణ్ చేస్తున్న నాలుగో చిత్రం `అంధ‌గాడు`. ఓ స్ట్రాంగ్ అండ్ ఎగ్జ‌యిట్‌మెంట్ పాయింట్‌తో సినిమా అంతా ర‌న్ అవుతుంది. క‌థ విన‌గానే రాజ్ త‌రుణ్ సినిమా చేయ‌డానికి వెంట‌నే అంగీక‌రించాడు. ఇక నిర్మాత రామ‌బ్ర‌హ్మం సుంక‌ర గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌థానుగుణంగా క్వాలిటీ ఏమాత్రం త‌గ్గ‌కుండా సినిమాను నిర్మించ‌డానికి ముందుండే నిర్మాత‌. సినిమా త‌ప్ప‌కుండా అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే విధంగా ఉంటుంది`` అన్నారు.
రాజ్‌త‌రుణ్‌, హెబ్బాప‌టేల్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఆశిష్ విద్యార్థి, రాజా ర‌వీంద్ర‌, షాయాజీ షిండే, స‌త్య‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర రావు త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః బి.రాజ‌శేఖ‌ర్‌, ఆర్ట్ః కృష్ణ మాయ‌, చీఫ్ కోడైరెక్ట‌ర్ః సాయి దాసం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కిషోర్ గ‌రిక‌పాటి, స‌హ నిర్మాతః అజ‌య్ సుంక‌ర‌, నిర్మాతః రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు,దర్శ‌క‌త్వంః వెలిగొండ శ్రీనివాస్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.