close
Choose your channels

రాజుతో రాజ్ తరుణ్...

Wednesday, February 15, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇప్పుడున్న యంగ్ హీరోస్‌లో స‌క్సెస్ మీదున్న రాజ్‌త‌రుణ్‌..కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌, అంధ‌గాడు సినిమాలు చేస్తున్నాడు. అయితే శ‌త‌మానం భ‌వ‌తి చిత్రంలో న‌టించడానికి అవ‌కాశం వ‌స్తే, వ‌ద్ద‌న్నా ఈ కుర్ర హీరో ఇప్పుడు మ‌రోసారి ఆ త‌ప్పు చేయ‌కూడ‌ద‌నుకున్నాడో ఏమో కానీ..త‌న నెక్ట్స్ మూవీని దిల్‌రాజు బ్యాన‌ర్‌లో చేస్తున్నాడ‌ని టాక్‌. `అలా ఎలా` వంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అనీష్ ఆర్‌.కృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని స‌మాచారం. అలా ఎలా త‌ర్వాత అనీష్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని అల్ల‌రి న‌రేష్‌తో చేద్దామనుకున్నాడ‌ని కానీ, ఆ సినిమా ఆల‌స్యం అవుతుండ‌టంతో, దిల్‌రాజుకు త‌న స్క్రిప్ట్‌ను వినిపించాడ‌ట‌. దిల్‌రాజు సినిమా చేయ‌డానికి అంగీకరించాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.