close
Choose your channels

స్టూడెంట్ నెం 1 స‌క్సెస్ క్రెడిట్ పృధ్వీతేజ్ కే చెందుతుంది - రాజ‌మౌళి..!

Tuesday, September 27, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - రాజ‌మౌళి కాంబినేష‌న్లో రూపొందిన స్టూడెంట్ నెం 1 చిత్రం రిలీజై నేటికి 15 ఏళ్లు పూర్త‌య్యింది. స్టూడెంట్ నెం 1 చిత్రం రాజ‌మౌళికి మొద‌టి చిత్రం. ఎన్టీఆర్ కి రెండవ చిత్రం. వీరిద్ద‌రి కెరీర్ లో మ‌ర‌చిపోలేని చిత్రంగా నిలిచింది. తన తొలి చిత్రం స్టూడెంట్ నెం 1 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా రాజ‌మౌళి ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ....ద‌ర్శ‌కుడుగా 15 ఏళ్లు, ఎడిటింగ్ అసిస్టెంట్ గా 25 ఏళ్లు అయ్యింది. 15 ఏళ్లు అంటే విన‌డానికి ఎన్నో ఏళ్లు అయిన‌ట్టు అనిపిస్తుంది కానీ నాకు అలా అనిపించ‌డంలేదు.

ఈ సినిమా షూటింగ్ టైమ్ లో స్విట్జ‌ర్లాండ్ లో నేను, తార‌క్ ఓకే రూమ్ లో ఉన్నాం. నేను రాత్రి 9 గంట‌ల‌కే ప‌డుకోవాలి అనుకునేవాడిని కానీ..తార‌క్ రూమ్ లో ఉన్న టీవీలో అగ్రిక‌ల్చ‌ర్ ప్రొగ్రామ్ ను 12 గంట‌ల‌కు చూసేవాడు. దీంతో ఎన్టీఆర్ ను తిట్టేయాలి అనిపించేది ఆ సంఘ‌ట‌న‌ను ఇప్పుడు త‌లుచుకున్నా...అదే ఫీలింగ్. నా డైరెక్ష‌న్ విష‌యానికి వ‌స్తే...ఇంట‌ర్వెల్ సీన్ మిన‌హా అంతా స‌రిగా తీయ‌లేద‌నిపిస్తుంది.స్టూడెంట్ నెం 1 స‌క్సెస్ క్రెడిట్ పృధ్వీతేజ్ స్ర్కిప్ట్ & కీర‌వాణి మ్యూజిక్ కే చెందుతుంది అంటూ త‌న 15 ఏళ్ల నాటి అనుభ‌వాల‌ను పంచుకున్నారు జ‌క్క‌న్న‌..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.