close
Choose your channels

నాని సినిమాలో రాజ‌మౌళి...?

Tuesday, September 6, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, జెంటిల్ మ‌న్ వంటి వ‌రుస స‌క్సెస్‌లు సాధించిన నేచుర‌ల్ స్టార్ నాని ఇప్పుడు ఉయ్యాలా జంపాలా ఫేమ్ విరించి వ‌ర్మ‌ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న `మ‌జ్ను` శ‌ర‌వేగంగా చిత్రీకర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, కేవా మూవీస్ బ్యాన‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా, గోపీసుంద‌ర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

స్టాప్ డ్రింకింగ్‌, స్టార్ట్ ల‌వ్ అనే లైన్స్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ సినిమా ఒక హీరో, ఇద్ద‌రు హీరోయిన్స్ మ‌ధ్య ప్రేమ‌క‌థాచిత్రం. ఈ చిత్రంలో నాని అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా క‌న‌ప‌డ‌తాడ‌ట‌. కాగా ఈ చిత్రంలో రాజ‌మౌళి ఓ స‌న్నివేశంలో క‌న‌ప‌డ‌తాడ‌ని స‌మాచారం. అయితే ఏ సంద‌ర్భంలో అని అయితే రివీల్ కాలేదు. నాని అసిస్టెంట్ డైరెక్ట‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాడు క‌దా..రాజ‌మౌళికి అసిస్టెంట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాడ‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.