close
Choose your channels

జనతా గ్యారేజ్ - రాజమౌళి రివ్యూ..!

Thursday, September 1, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. మోహ‌న్ లాల్ కీల‌క పాత్ర పోషించిన జ‌న‌తా గ్యారేజ్ ఈరోజు (సెప్టెంబ‌ర్ 1) ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. హైద‌రాబాద్ కూక‌ట్ ప‌ల్లి భ్ర‌మ‌రాంబ థియేట‌ర్ లో ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి జ‌న‌తా గ్యారేజ్ స్పెష‌ల్
షో చూసారు. అనంత‌రం ట్విట్ట‌ర్ లో జ‌న‌తా గ్యారేజ్ గురించి స్పందిస్తూ...మోహ‌న్ లాల్ గారు, తార‌క్...ఈ ఇద్ద‌రి క్యారెక్ట‌ర్స్ మ‌ధ్య ఉన్న ఇన్ టెన్ష‌నిటి న‌న్ను బాగా ఆకట్టుకుంది.
వీరిద్ద‌రి న‌ట‌న నాకు బాగా న‌చ్చింది. తార‌క్ టెంప‌ర్ సినిమా ద‌గ్గ‌ర నుంచి త‌న క్యారెక్ట‌ర్స్ & కెరీర్ ను మ‌లుచుకునే విధానం చూసి గ‌ర్విస్తున్నాను. ఇక నా ఫ్రెండ్ రాజీవ్ క‌న‌కాల సిన్సియ‌ర్ గ‌వ‌ర్న‌మెంట్ క్ల‌ర్క్ గా హృద‌యాన్ని క‌ద‌లించేలా అద్భుతంగా న‌టించాడు. ఈ చిత్రాన్ని రెండు సార్లు చూసి ఆనందించాను అంటూ జ‌న‌తా గ్యారేజ్ త‌న‌కు ఎంత బాగా న‌చ్చిందో తెలియ‌చేసారు ద‌ర్శ‌క‌ధీర‌..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.