close
Choose your channels

రాజశేఖర్ మూవీ ఫస్ట్ లుక్ డేట్...

Wednesday, February 1, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పోలీస్‌, సి.బి.ఐ పాత్ర‌ల‌కు హీరో డా.రాజ‌శేఖ‌ర్ పెట్టింది పేరు. అంకుశం, అగ్ర‌హం, మ‌గాడు స‌హా ప‌లు పోలీసు క్యారెక్ట‌ర్స్‌లో రాజ‌శేఖ‌ర్ మెప్పించారు. ఇప్పుడు ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ‌శేఖ‌ర్ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో కూడా రాజ‌శేఖ‌ర్ ఇన్విస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గానే క‌న‌ప‌డ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమాకు `గ‌రుడ వేగ` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఓ ఇన్విస్టిగేష‌న్ ఆఫీస‌ర్ జీవితంలో అనుకోకుండా స‌మ‌స్య‌లు ఎదురైతే వాటి నుండి త‌నెలా భ‌య‌ప‌డ్డాడు, ప్ర‌జ‌ల‌నే ర‌క్షించాడ‌నేదే క‌థాంశమ‌ట‌. ఈ సినిమాలో పూజాకుమార్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను రాజ‌శేఖ‌ర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.